Telugu Global
NEWS

జిమ్మీ.. చంద్ర‌బాబు స‌న్నిహితుడే...

ఓటుకు కోట్లు కుంభ‌కోణంలో అనూహ్యంగా తెర‌పైకి వ‌చ్చిన జిమ్మి తెలుగుదేశం అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుకు అత్యంత స‌న్నిహితుడ‌ట‌.  తెలుగుయువ‌త ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసిన జిమ్మి… చంద్ర‌బాబుతో క‌ల‌సి ఉండ‌గా తీసిన ఫొటోలు ఇపుడు సోష‌ల్‌మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. రేవంత్‌రెడ్డిని అరెస్టు చేసి జైలులో పెట్టిన నెల‌రోజుల కాలంలో జిమ్మి గుంటూరులో త‌ల‌దాచుకున్నాడ‌ని, రేవంత్ బెయిల్‌పై విడుద‌లైన త‌ర్వాత ఆయ‌న హైద‌రాబాద్ వ‌చ్చాడ‌ని అంటున్నారు.  మత్తయ్య ప్రెండ్‌గా, సెబాస్టియన్‌ను ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు పరిచయం చేసింది ఈ జిమ్మీయే! నెల […]

జిమ్మీ.. చంద్ర‌బాబు స‌న్నిహితుడే...
X
ఓటుకు కోట్లు కుంభ‌కోణంలో అనూహ్యంగా తెర‌పైకి వ‌చ్చిన జిమ్మి తెలుగుదేశం అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుకు అత్యంత స‌న్నిహితుడ‌ట‌. తెలుగుయువ‌త ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసిన జిమ్మి… చంద్ర‌బాబుతో క‌ల‌సి ఉండ‌గా తీసిన ఫొటోలు ఇపుడు సోష‌ల్‌మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. రేవంత్‌రెడ్డిని అరెస్టు చేసి జైలులో పెట్టిన నెల‌రోజుల కాలంలో జిమ్మి గుంటూరులో త‌ల‌దాచుకున్నాడ‌ని, రేవంత్ బెయిల్‌పై విడుద‌లైన త‌ర్వాత ఆయ‌న హైద‌రాబాద్ వ‌చ్చాడ‌ని అంటున్నారు. మత్తయ్య ప్రెండ్‌గా, సెబాస్టియన్‌ను ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు పరిచయం చేసింది ఈ జిమ్మీయే! నెల రోజులుగా ఏసీబీ దర్యాప్తులో ఎక్కడా కూడా ఈ పేరు ఎవరికీ వినిపించలేదు. తాజాగా ఎమ్మెల్యే సండ్రతో పాటు జిమ్మీకి సీఆర్‌పీసీ 41(ఏ) ప్రకారం నోటీసులివ్వడంతో సర్వత్రా చర్చ మొదలైంది. అసలెవరీ జిమ్మీ? ఇతడి కథేంటి? ఓటుకు నోటు కుట్రలో జిమ్మీ పాత్రేంటి? అనే చర్చ మొదలైంది. ఈ కుట్రలో ముందుగా స్టీఫెన్‌సన్‌తో టచ్‌లోకి వచ్చింది మత్తయ్య జెరూసలేం. అయితే మత్తయ్య రూ.2కోట్లు టీడీపీ తరుపున ఆఫర్ చేయడం, తర్వాత సీన్‌లోకి సెబాస్టియన్ రావడం అందరికీ తెలిసిందే. కానీ సెబాస్టియన్ రావడానికి, మత్తయ్యకు స్టీఫెన్‌సన్‌కుమధ్య మరో వ్యక్తిగా, మధ్యవర్తిగా పాత్ర వహించింది జిమ్మీయే. దీనితో ఇప్పుడు ఇతడిపై కూడా ఏసీబీ దృష్టి పెట్టిందని తెలిసింది. మత్తయ్య వ్యవహారం మొత్తం జిమ్మీకి తెలుసని, అటు మత్తయ్యకు, ఇటు సెబాస్టియన్‌కు కీలక వ్యక్తిగా జిమ్మీ వ్యవహరించారని ఏసీబీ ధృవపరుచుకుంది. ఇతడిని విచారిస్తే అత్యంత కీలక వ్యక్తులకు సంబంధించి మరిన్ని కీలక ఆధారాలు లభిస్తాయని ఏసీబీ భావిస్తున్నది. ముఖ్యంగా సెబాస్టియన్‌కు రూ.50 లక్షలు ఇచ్చిందెవరో తేలుతుందని ఏసీబీ అంచనా వేస్తున్నది.
First Published:  5 July 2015 11:38 AM IST
Next Story