మరోసారి దావూద్ మరక!
ముంబయి బాంబు పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం అంశం మరోసారి కలకలం రేపుతోంది. ప్రముఖ న్యాయకోవిదుడు రాంజెఠ్మలానీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. పేలుళ్ల అనంతరం దావూద్ తనతో ఫోన్‌లో మాట్లాడాడని రాంజెఠ్మలానీ శనివారం వెల్లడించారు. కేసు విచారణ జరుగుతున్నంత సేపు గృహ నిర్బంధంలో ఉండేలా చూస్తే లొంగిపోయేందుకు దావూద్ సిద్ధ పడినట్లు తెలిపారు. ఈ విషయాన్ని అప్పటి సీఎం శరద్‌పవార్ దృష్టికి తీసుకెళ్లానన్నారు. కానీ, మహారాష్ర్ట ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తిరస్కరించిందని చెప్పారు. దావూద్ విషయం […]
BY Pragnadhar Reddy4 July 2015 11:01 PM GMT
X
Pragnadhar Reddy Updated On: 6 July 2015 12:01 AM GMT
ముంబయి బాంబు పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం అంశం మరోసారి కలకలం రేపుతోంది. ప్రముఖ న్యాయకోవిదుడు రాంజెఠ్మలానీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. పేలుళ్ల అనంతరం దావూద్ తనతో ఫోన్‌లో మాట్లాడాడని రాంజెఠ్మలానీ శనివారం వెల్లడించారు. కేసు విచారణ జరుగుతున్నంత సేపు గృహ నిర్బంధంలో ఉండేలా చూస్తే లొంగిపోయేందుకు దావూద్ సిద్ధ పడినట్లు తెలిపారు. ఈ విషయాన్ని అప్పటి సీఎం శరద్‌పవార్ దృష్టికి తీసుకెళ్లానన్నారు. కానీ, మహారాష్ర్ట ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తిరస్కరించిందని చెప్పారు. దావూద్ విషయం ఇటీవలి కాలంలో జాతీయమీడియాలో ప్రస్తావనకు రావడం ఇది రెండోసారి. దావూద్ లొంగుబాటుపై ఢిల్లీ మాజీ పోలీసు కమిషనర్ నీరజ్ కుమార్ ఈ ఏడాది మేలో చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని అప్పటి సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న విజయరామారావు ఖండించారు. అలాంటి ప్రయత్నాలేవీ జరగలేదని స్పష్టం చేశారు. దీంతో దావూద్ లొంగుబాటుపై తానెలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తన మాటలను వక్రీకరించారని నీరజ్‌కుమార్ చెప్పుకొచ్చారు. తాజాగా రాంజెఠ్మలానీ చేసిన కామెంట్లు ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌కు, అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు మరోసారి మరక అంటించాయి.
Next Story