Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 134

వెంకయ్య తన గాడిదను ఒక ఆర్మీ క్యాంప్‌ పక్కనించి తోలుకెళుతున్నాడు. అది చూసిన ఇద్దరు సైనికులు అతన్ని ఉడికించాలని వెళ్లి “మీ తమ్ముణ్ణి ఎందుకంత గట్టిగా లాగుతున్నావు?” అన్నారు నవ్వుతూ. “లేకుంటే వెళ్ళి మిల్ట్రీలో చేరతానంటున్నాడు” అన్నాడు వెంకయ్య. —————————————————————————————————————— జార్జి: మా ముత్తాత నెపోలియన్‌తో యుద్ధం చేశాడు. మా తాత ఫ్రెంచి వాళ్ళతో యుద్ధం చేశాడు. మా నాన్న అమెరికన్లతో యుద్ధం చేశాడు. మేరీ: మీ కుటుంబం వాళ్ళకి అందర్తో పోట్లాడ్డమే పనిలా ఉంది. —————————————————————————————————————— […]

వెంకయ్య తన గాడిదను ఒక ఆర్మీ క్యాంప్‌ పక్కనించి తోలుకెళుతున్నాడు.
అది చూసిన ఇద్దరు సైనికులు అతన్ని ఉడికించాలని వెళ్లి “మీ తమ్ముణ్ణి ఎందుకంత గట్టిగా లాగుతున్నావు?” అన్నారు నవ్వుతూ.
“లేకుంటే వెళ్ళి మిల్ట్రీలో చేరతానంటున్నాడు” అన్నాడు వెంకయ్య.
——————————————————————————————————————
జార్జి: మా ముత్తాత నెపోలియన్‌తో యుద్ధం చేశాడు. మా తాత ఫ్రెంచి వాళ్ళతో యుద్ధం చేశాడు. మా నాన్న అమెరికన్లతో యుద్ధం చేశాడు.
మేరీ: మీ కుటుంబం వాళ్ళకి అందర్తో పోట్లాడ్డమే పనిలా ఉంది.
——————————————————————————————————————
మూడేళ్ళ అబ్బాయి, ఐదేళ్ళ అమ్మాయి అమ్మా నాన్న ఆట ఆడుదామనుకున్నారు.
ఎదురుగా ఉన్న ఒక ఇంటికి వెళ్ళి తలుపుతట్టారు. ఒకావిడ తలుపు తీసింది. “ఏమిటి?” అని ఆవిడ అడిగింది. ఆ అమ్మాయి “మేమిద్దం అమ్మానాన్నలం. మేము లోపలికి రావచ్చా?” అంది. ఆవిడ ఆసక్తిగా ఇద్దర్నీ లోపలికి పిలిచి కూర్చోబెట్టి కేకులిచ్చింది.
తాగడానికి రెండు గ్లాసుల రస్నా ఇచ్చింది. వాళ్ళు తాగేశాక “ఇంకో గ్లాసు జ్యూస్‌ ఇమ్మంటారా?” అంది.
ఆ అమ్మాయి లేచి “వద్దండీ! మా ఆయన ప్యాంట్‌ తడిచిపోయింది. వస్తాను” అంది.
——————————————————————————————————————
తల్లిదండ్రులు అర్జంటుగా ఎక్కడికో వెళ్ళాల్సి రావడంతో ఎనిమిదేళ్ళ శారదను పక్కింట్లో ఒక పూట వదిలి వెళ్ళారు. పక్కింటి రాధ అభిమానంతో శారదకు ఏవి అవసరమో జాగ్రత్తగా కనిపెట్టి అనుకూలంగా చూసుకుంది. రాత్రి భోజనాలప్పుడు శారద “ఆంటీ! డిన్నరప్పుడు మా మమ్మీ ఆమ్లెట్లు వేస్తుంది” అంది. భోజనానికి కూర్చోబోయిన రాధ లేచివెళ్ళి త్వరత్వరగా ఆమ్లెట్లు వేసుకుని వచ్చింది. కానీ శారద అవి తినలేదు. “ఎందుకు తినలేదు” అడిగింది రాధ. “మా మమ్మీ ఆమ్లెట్లు వేస్తుంది కానీ నేను తినను ఆంటీ” అంది తాపీగా.
——————————————————————————————————————
“నీకు సైటు లేదు కదా అద్దాలెందుకు పెట్టుకున్నావు?”
“మా అన్న కొత్త అద్దాలు కొన్నాడు. పాతవి వేస్టు చెయ్యడమెందుకని పెట్టుకుంటున్నా”

First Published:  4 July 2015 6:33 PM IST
Next Story