అక్రమ నిర్మాణంలో చంద్రబాబు నివాసం
అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందని సామెత. అందరికీ సుద్దులు చెప్పేముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పరిస్థతి కూడా అలానే మారింది. ఆయనే నిబంధనలు పాటించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. విజయవాడలో నిబంధనలు పట్టించుకోకుండా అక్రమ నిర్మాణంలో నివాసం ఏర్పాటు చేసుకోవడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ విషయాన్ని సీపీఎం బయటపెట్టింది. విజయవాడలో చంద్రబాబు నివాసముండే ప్రాంతం కృష్ణానది పరీవాహక ప్రాంతం వెంబడి ఉన్న అక్రమ కట్టడం కావడం పలు విమర్శలకు దారితీస్తోంది. రివర్ కన్జర్వెన్సీ యాక్ట్ 1884 ప్రకారం కరకట్టకు […]
BY Pragnadhar Reddy5 July 2015 10:16 AM IST
X
Pragnadhar Reddy Updated On: 6 July 2015 5:33 AM IST
అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందని సామెత. అందరికీ సుద్దులు చెప్పేముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పరిస్థతి కూడా అలానే మారింది. ఆయనే నిబంధనలు పాటించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. విజయవాడలో నిబంధనలు పట్టించుకోకుండా అక్రమ నిర్మాణంలో నివాసం ఏర్పాటు చేసుకోవడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ విషయాన్ని సీపీఎం బయటపెట్టింది. విజయవాడలో చంద్రబాబు నివాసముండే ప్రాంతం కృష్ణానది పరీవాహక ప్రాంతం వెంబడి ఉన్న అక్రమ కట్టడం కావడం పలు విమర్శలకు దారితీస్తోంది. రివర్ కన్జర్వెన్సీ యాక్ట్ 1884 ప్రకారం కరకట్టకు దిగువన నదీ గర్భం, పరీవాహక ప్రాంతంలో కట్టడాల నిర్మాణం అక్రమం. ప్రస్తుతం చంద్రబాబు నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకున్న నదీ గర్భంలో ఇప్పటికే కృష్ణాజిల్లా వైపు 17, గుంటూరు జిల్లా వైపు 48 కట్టడాలు అక్రమంగా ఉన్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు గుర్తించారు. గుంటూరు వైపున్న కట్టడాల్లో మూడు కట్టడాలకే తాత్కాలిక ప్రాతిపదికన కట్టుకునేందుకు అనుమతి ఉంది. ముఖ్యమంత్రి నివాసానికని సిద్ధం చేయాలనుకున్న కట్టడమున్నచోట స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి మాత్రమే అనుమతి ఉంది. ఆయనకు సిద్ధం చేస్తున్న నివాసం పూర్తిగా చట్టవిరుద్ద కట్టడం. అలాంటి అక్రమ కట్టడంలో ఉండేందుకు సిద్ధమవుతున్న చంద్రబాబు ఇక రాష్ట్ర ప్రజలకు ఎటువంటి సంకేతాలిస్తారని సీపీఎం ప్రశ్నిస్తోంది. భవానీపురం కరకట్ట వెంట టూరిజం అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లు కరకట్ట వెంట దిగువన ఉన్నాయని సాకు చూపుతూ తొలగించాలని నోటీసులు జారీ చేశారని, అదే ప్రాంతంలో నదికి అవతల వైపున కరకట్ట దిగువన చంద్రబాబెలా నివాసముంటారని సీపీఎం నాయకులు ప్రశ్నిస్తున్నారు. రాజధాని కోసం వేలాది ఎకరాలు సేకరించిన ప్రభుత్వం, నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలున్న కృష్ణా నదీ గర్భ కరకట్ట వెంట ప్రాంతాన్నెందుకు స్వాధీనం చేసుకోలేదో తేటతెల్లం చేయాలని వారు అడుగుతున్నారు. నదిలో పర్యటన సందర్భంలో నదీ గర్భం వెంట నిర్మాణాలు చూసి ఆశ్చర్యపోయిన ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆయా కట్టడాలన్నింటినీ తొలగిస్తామని చెప్పారని, మరి ముఖ్యమంత్రే ఆ కట్ట్టడాల్లో ఉండేందుకు సిద్ధమవుతున్న తరుణంలో మంత్రి ఏం చేస్తారో చెప్పాలని సీపీఎం నాయకులు ప్రశ్నిస్తున్నారు.
Next Story