Telugu Global
Others

పుష్కర బస్సుల్లో 15% అదనపు చార్జీ: ఆర్టీసీ యోచన

గోదావరి పుష్కరాలకు రోజువారీ తిరిగే బస్సులకు అదనంగా 1800 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల నుంచి 1500, రాజమండ్రిలో పుష్కర ఘాట్లకు భక్తులు చేరుకునేందుకు 300 ఉచిత బస్సులను నడపనున్నారు. రాష్ట్రంలోని దూర ప్రాంతాల నుంచి అవసరాన్ని బట్టి ప్రత్యేక బస్సులు నడుపుతామని, ఈ సర్వీసులకు సాధారణ చార్జీ కంటే 15 శాతం అదనంగా వసూలు చేసే ఆలోచన ఉన్నట్లు బస్‌భవన్‌ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి ఏపీఎస్‌ఆర్‌టీసీ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో […]

గోదావరి పుష్కరాలకు రోజువారీ తిరిగే బస్సులకు అదనంగా 1800 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల నుంచి 1500, రాజమండ్రిలో పుష్కర ఘాట్లకు భక్తులు చేరుకునేందుకు 300 ఉచిత బస్సులను నడపనున్నారు. రాష్ట్రంలోని దూర ప్రాంతాల నుంచి అవసరాన్ని బట్టి ప్రత్యేక బస్సులు నడుపుతామని, ఈ సర్వీసులకు సాధారణ చార్జీ కంటే 15 శాతం అదనంగా వసూలు చేసే ఆలోచన ఉన్నట్లు బస్‌భవన్‌ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి ఏపీఎస్‌ఆర్‌టీసీ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో సాధారణ చార్జీలకే టికెట్లు రిజర్వేషన్‌ చేయించుకోవచ్చని, రోజుకు 1.40 లక్షల సీట్లు రిజర్వు అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు.
First Published:  4 July 2015 1:04 PM GMT
Next Story