Telugu Global
Others

రెండు విశ్వ‌విద్యాల‌యాల‌పై తెలుగు రాష్ట్రాల‌ అంగీకారం 

నిర్వహణ వ్యయంలో 58 శాతం చెల్లింపునకు ఏపీ ఓ.కే. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాల‌లో చ‌దువుకోవాల‌నుకునే విద్యార్థుల‌కు మార్గం స‌గ‌మ‌మైంది. ఒక‌వైపు గ‌వ‌ర్న‌ర్ జోక్యం చేసుకోవ‌డం, మ‌రోవైపు ఇరు రాష్ట్ర ప్ర‌భుత్వాలు సంప్ర‌దింపులు జ‌ర‌ప‌డం ద్వారా ఓ ప‌రిష్కారం లభించింది. ఏపీ విద్యార్థులకు సేవలు అందించాలంటే అందుకయిన ఖ‌ర్చులు చెల్లించాల‌ని తెలంగాణ సర్కారు చేసిన ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం అంగీకరించింది. రెండు యూనివర్సిటీల నిర్వహణ వ్యయం (రన్నింగ్‌ ఎక్స్‌పెండిచర్) లో జనాభా […]

రెండు విశ్వ‌విద్యాల‌యాల‌పై తెలుగు రాష్ట్రాల‌ అంగీకారం 
X

నిర్వహణ వ్యయంలో 58 శాతం చెల్లింపునకు ఏపీ ఓ.కే. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాల‌లో చ‌దువుకోవాల‌నుకునే విద్యార్థుల‌కు మార్గం స‌గ‌మ‌మైంది. ఒక‌వైపు గ‌వ‌ర్న‌ర్ జోక్యం చేసుకోవ‌డం, మ‌రోవైపు ఇరు రాష్ట్ర ప్ర‌భుత్వాలు సంప్ర‌దింపులు జ‌ర‌ప‌డం ద్వారా ఓ ప‌రిష్కారం లభించింది. ఏపీ విద్యార్థులకు సేవలు అందించాలంటే అందుకయిన ఖ‌ర్చులు చెల్లించాల‌ని తెలంగాణ సర్కారు చేసిన ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం అంగీకరించింది. రెండు యూనివర్సిటీల నిర్వహణ వ్యయం (రన్నింగ్‌ ఎక్స్‌పెండిచర్) లో జనాభా ప్రాతిపదికన 58 శాతం చెల్లించేందుకు ఒప్పుకొంది. మరో రెండు మూడు రోజుల్లో ఈ మేరకు రెండు ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరే అవకాశముంది. విభజన చట్టంలోని పదో షెడ్యూలులోని సంస్థలన్నీ త‌మ‌వే అంటూ ఓపెన్‌ యూనివర్సిటీ, అంబేద్కర్‌ వర్సిటీల అడ్మిషన్లను టీ-సర్కారు తమ విద్యార్థులకే పరిమితం చేసిన సంగతి తెలిసిందే. ఓపెన్‌ వర్సిటీ అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులకు ప్రవేశ పరీక్షను రెండు రాష్ట్రాల విద్యార్థులకు నిర్వహించినా… ఏపీ విద్యార్థుల ఫలితాలను నిలిపివేసింది. ఈ అంశంపై శనివారం గవర్నర్‌ నరసింహన్‌ కూడా స్పందించారు. అడ్మిషన్లలో ‘యథాతథ స్థితి’ని కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ ఇన్‌చార్జి వైస్‌ చాన్సలర్‌ రంజీవ్‌ ఆర్‌ ఆచార్య, తెలుగు వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ఎ.శివారెడ్డిలను ఆదేశించారు. ఒక పరిష్కారం లభించే వరకు రెండు రాష్ట్రాల‌కు ఉమ్మడిగా సేవలు అందించాలని స్పష్టం చేశారు. గ‌వ‌ర్న‌ర్ ఇచ్చిన ఆదేశాల్లో ‘యథాతథ‘ స్థితి అంటే ఏమిటో అర్ధం కాక రెండు వర్సిటీల అధికారులు తర్జన భర్జన పడ్డారు. ‘‘2014 జూన్‌ 2 తర్వాతి పరిస్థితి అంటే… తెలంగాణ విద్యార్థులకు మాత్రమే సేవలు అందించాలి. జూన్‌ 2కు ముందున్న పరిస్థితి అంటే మాత్రం 2 రాష్ట్రాల విద్యార్థులకు సేవలు అందించాల్సి ఉంటుంది. గవర్నర్‌ ఆదేశాలపై స్పష్టత లేక పోవ‌డంతో టీ విద్యాశాఖను సంప్రదించి నిర్ణయం తీసుకుంటాం’ అని వారు ఆ ఆదేశాల‌ను ప‌క్క‌న పెట్టేశారు. గవర్నర్‌ ఆదేశాలపై స్పష్టత వచ్చేలోపు విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. తెలుగు వర్సిటీకి ఏపీలో మూడు పీఠాలు ఉన్నప్పటికీ.. అవి పట్టాలు జారీ చేయలేవు. ఈ ప్రతిష్ఠంభన ఇలాగే కొనసాగితే.. ఇబ్బందులు తప్పవు. దీంతో ఏపీ సర్కారు స్పందించింది. ఏపీ సీఎస్‌ కృష్ణారావు తెలంగాణ సీఎస్‌ రాజీవ్‌ శర్మకు ఫోన్‌ చేసి దీనిపై చర్చించారు. ఓపెన్‌ వర్సిటీ, తెలుగు వర్సిటీలకి సంబంధించి విద్యార్థుల ప్రాతిపదికన కాకుండా, నిర్వహణ వ్యయంలో జనాభా ప్రాతిపదికన 58 శాతం సొమ్ము చెల్లిస్తామని తెలిపారు. దీనికి టీ సీఎస్‌ అంగీకరించారు. త్వరలోనే దీనిపై ఒప్పందం కుదురుతుందని సమాచారం.

First Published:  5 July 2015 3:01 AM IST
Next Story