తల్లిగా మారిన అనుష్క
ఇప్పటికే బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక సినిమాలో నటించింది అనుష్క, తన నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే సినిమా అది. అటు రుద్రమదేవి సినిమాతో నటవిశ్వరూపాన్ని కూడా చూపించడానికి రెడీ అవుతోంది బొమ్మాళి. ఇలా పాత్రలకు ప్రాధాన్యం ఇస్తూ దూసుకుపోతోంది. ఇప్పుడు మరో కీలకపాత్ర పోషించేందుకు సిద్ధమైంది అనుష్క. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ తల్లిగా నటించేందుకు అంగీకరించింది. నిజానికి హీరోయిన్ గా లైమ్ లైట్ లో కొనసాగుతున్న టైమ్ లో కొన్ని పాత్రలకు హీరోయిన్లు అస్సలు ఒప్పుకోరు. కానీ అనుష్క […]
BY sarvi5 July 2015 12:36 AM IST
X
sarvi Updated On: 5 July 2015 5:06 AM IST
ఇప్పటికే బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక సినిమాలో నటించింది అనుష్క, తన నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే సినిమా అది. అటు రుద్రమదేవి సినిమాతో నటవిశ్వరూపాన్ని కూడా చూపించడానికి రెడీ అవుతోంది బొమ్మాళి. ఇలా పాత్రలకు ప్రాధాన్యం ఇస్తూ దూసుకుపోతోంది. ఇప్పుడు మరో కీలకపాత్ర పోషించేందుకు సిద్ధమైంది అనుష్క. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ తల్లిగా నటించేందుకు అంగీకరించింది. నిజానికి హీరోయిన్ గా లైమ్ లైట్ లో కొనసాగుతున్న టైమ్ లో కొన్ని పాత్రలకు హీరోయిన్లు అస్సలు ఒప్పుకోరు. కానీ అనుష్క మాత్రం పాత్రలతో ప్రయోగాలు చేసేందుకు సిద్ధమైంది. సూర్య సరసన చేయబోతున్న సింగం-3 సినిమాలో తల్లిగా నటించేందుకు అంగీకరించింది. సింగంలో లవర్స్ గా కనిపించిన వీళ్లిద్దర్నీ సింగం-3లో భార్యాభర్తలుగా చూపించేందుకు సిద్ధమౌతున్నాడు దర్శకుడు హరి. అంతేకాదు.. ఓ ఏడాది బాబుకు తల్లిగా అనుష్కను చూపించడానికి రెడీ అవుతున్నాడు. దీనికోసం కాస్త బరువు పెరగమని అనుష్కకు సూచించాడు కూడా. ప్రస్తుతం అనుష్క అదే పనిలో ఉంది. ఏడాది బాబుకు తల్లిగా నటించేందుకు అవసరమైన ఫిజిక్ కోసం ప్రయత్నిస్తోంది.
Next Story