సాహిత్య అకాడమీ ఫెలోషిప్ ప్రదానం నిలిపివేత
ఈనెల 6వ తేదీన రవీంద్రభారతిలో జరగాల్సిన సాహిత్య అకాడమీ ఫెలోషిప్ కార్యక్రమం ప్రకటిత తేదిన జరగదని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. సాహిత్యంతో పాటు ఇతర రంగాల్లో అత్యంత ప్రతిభా పాటవాలు కనపరిచిన 21 మందికి ప్రతి ఏటా సాహిత్య అకాడమీ ఫెలోషిప్ పురస్కారాన్ని ప్రదానం చేస్తుంది. సాహిత్యరంగంలో తెలుగువాడైన డా. సి.నారాయణరెడ్డి చేసిన సేవలకుగాను ఈనెల 6వ తేదీన రవీంద్రభారతిలో ఈ పురస్కారాన్ని అందచేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అయితే, అదేరోజున సంవాద్ కార్యక్రమం […]
BY sarvi3 July 2015 6:47 PM IST
sarvi Updated On: 4 July 2015 9:11 AM IST
ఈనెల 6వ తేదీన రవీంద్రభారతిలో జరగాల్సిన సాహిత్య అకాడమీ ఫెలోషిప్ కార్యక్రమం ప్రకటిత తేదిన జరగదని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. సాహిత్యంతో పాటు ఇతర రంగాల్లో అత్యంత ప్రతిభా పాటవాలు కనపరిచిన 21 మందికి ప్రతి ఏటా సాహిత్య అకాడమీ ఫెలోషిప్ పురస్కారాన్ని ప్రదానం చేస్తుంది. సాహిత్యరంగంలో తెలుగువాడైన డా. సి.నారాయణరెడ్డి చేసిన సేవలకుగాను ఈనెల 6వ తేదీన రవీంద్రభారతిలో ఈ పురస్కారాన్ని అందచేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అయితే, అదేరోజున సంవాద్ కార్యక్రమం ఉండడంతో ఫెలోషిప్ కార్యక్రమాన్ని ప్రస్తుతానికి నిలిపి వేస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది.
Next Story