ప్రియాంక భూముల సమాచారం ఇవ్వాల్సిందే ...
సమాచార హక్కు చట్టం దృష్టిలో వీఐపీలు, సామాన్యులూ సమానమేనని, ఆర్టీఐ చట్టంలో వీఐపీలకు ప్రత్యేక వెసులుబాటు లేదని హిమాచల ప్రదేశ్ సమాచార శాఖ స్పష్టం చేసింది. అందువల్ల దరఖాస్తుదారుడికి దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ హిమాచల్ ప్రదేశ్‌లో కొన్న వ్యవసాయ భూముల వివరాలను వెల్లడించాల్సిందేనని ఆ రాష్ట్ర సమాచార కమిషన్ స్పష్టం చేసింది. ప్రియాంక సిమ్లాకు దగ్గరలోని ఛరాబ్రాలో భూమిని కొన్నారు. ఆ రాష్ట్ర రెవిన్యూ చట్టాల ప్రకారం వ్యవసాయేతర అవసరాలకు […]
BY sarvi3 July 2015 1:14 PM GMT
sarvi Updated On: 4 July 2015 2:54 AM GMT
సమాచార హక్కు చట్టం దృష్టిలో వీఐపీలు, సామాన్యులూ సమానమేనని, ఆర్టీఐ చట్టంలో వీఐపీలకు ప్రత్యేక వెసులుబాటు లేదని హిమాచల ప్రదేశ్ సమాచార శాఖ స్పష్టం చేసింది. అందువల్ల దరఖాస్తుదారుడికి దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ హిమాచల్ ప్రదేశ్‌లో కొన్న వ్యవసాయ భూముల వివరాలను వెల్లడించాల్సిందేనని ఆ రాష్ట్ర సమాచార కమిషన్ స్పష్టం చేసింది. ప్రియాంక సిమ్లాకు దగ్గరలోని ఛరాబ్రాలో భూమిని కొన్నారు. ఆ రాష్ట్ర రెవిన్యూ చట్టాల ప్రకారం వ్యవసాయేతర అవసరాలకు వ్యవసాయభూమిని కొనుగోలు చేసినప్పడు కొన్ని షరతులు విధిస్తారు. ప్రియాంకకు విధించిన షరతులు, ఇచ్చిన మినహాయింపు వివరాలు తెలుసుకునేందుకు సమాచారహక్కు కార్యకర్త దేవాశిష్ భట్టాచార్య ఆర్టీఐ కింద సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే, ప్రియాంకకు మాజీ ప్రధాని కుమార్తెగా ఎపీజీ భద్రత ఉందని, ఛరాబ్రాలో భూ కొనుగోలు వివరాలు వెల్లడిస్తే, ఆమె భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఎస్పీజీ లేఖ రాయడంతో ఆ వివరాలను బహిర్గతం చేయలేమని మొదటి అప్పిలేట్ అథారిటీ సమాచారమిచ్చారు. దీనిపై భట్టాచార్య రాష్ట్ర సమాచార కమిషన్ ముందు సవాల్ చేశారు. ఆర్టీఐ ముందు వీఐపీలు, సామాన్యులనే తేడా లేదని, అందరి వివరాలు ఇవ్వాల్సిందేనని సమాచార కమిషన్ స్పష్టం చేసింది.
Next Story