నేరుగా రాకపోతే.. మీకు ఓటు లేనట్టే
హైదరాబాద్‌లో ఉంటున్నారా .. ఓటు హక్కు ఉందా … అయితే ఫలానా తేదీ, ఫలానా సమయానికి స్వయంగా మా ఎదుట హాజరు కండి. రాకపోయారో మీ ఓటు తీసేస్తాం అంటూ ఎన్నికల సంఘం జీహెచ్ఎంసీ ఓటర్లకు కొత్తరకం హెచ్చరిక జారీ చేసింది . ఇప్పటివరకూ ఎన్నడూ ఎక్కడా లేని విధంగా ఓటర్లు నేరుగా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిని కలవాలనే ఎన్నికల సంఘం కొత్త నిబంధనతో జీహెచ్ఎంసీ ఓటర్లను భయభ్రాంతులకు గురవుతున్నారు. శాశ్వత చిరుమానా ఉన్న ఓటర్లకు కూడా […]
BY sarvi3 July 2015 6:41 PM IST
sarvi Updated On: 4 July 2015 8:19 AM IST
హైదరాబాద్‌లో ఉంటున్నారా .. ఓటు హక్కు ఉందా … అయితే ఫలానా తేదీ, ఫలానా సమయానికి స్వయంగా మా ఎదుట హాజరు కండి. రాకపోయారో మీ ఓటు తీసేస్తాం అంటూ ఎన్నికల సంఘం జీహెచ్ఎంసీ ఓటర్లకు కొత్తరకం హెచ్చరిక జారీ చేసింది . ఇప్పటివరకూ ఎన్నడూ ఎక్కడా లేని విధంగా ఓటర్లు నేరుగా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిని కలవాలనే ఎన్నికల సంఘం కొత్త నిబంధనతో జీహెచ్ఎంసీ ఓటర్లను భయభ్రాంతులకు గురవుతున్నారు. శాశ్వత చిరుమానా ఉన్న ఓటర్లకు కూడా మీరు గత కొద్దికాలంగా ఈ చిరునామాలో నివసించడం లేదు. అందువల్ల మిమ్మల్ని తాత్కాలిక నివాసులుగా పరిగణించి ఓటర్ల జాబితా నుంచి మీ పేరును తొలగిస్తున్నామంటూ నగరంలోని పలు ప్రాంతాల ప్రజలకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల అధికారులు ఓట్లను తొలగించేందుకే ఇలా వ్యవహరిస్తున్నారని నోటీసులు అందుకున్న ఓటర్లు మండిపడుతున్నారు. నిబంధనల ప్రకారం ఇంటింటి సర్వే చేసి ఓటర్లు ఆ చిరునామాలో లేరని గుర్తిస్తే అధికారులు నోటీసులు జారీ చేసి ఆధారాలు చూపకుంటే ఓటు హక్కు తొలగిస్తామని చెప్పడం సాధారణమని, అంతేకానీ ఇలా నేరుగా తమ ఎదుట హాజరవ్వాలని నోటీసులు పంపడం ఏమిటని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. అయితే, ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ మాత్రం ఇంటింటి సర్వే తర్వాతే ఈ నోటీసులు జారీ చేస్తున్నామని, ఓటర్లు నేరుగా హాజరుకావాల్సిన అవసరం లేదని, తమ వద్ద ఉన్న గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డుల నంబర్లు చెప్పి ఓటు హక్కును పునరుద్ధరించుకోవచ్చని అన్నారు.
Next Story