Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 133

ఇద్దరు కుర్రాళ్ళు వాళ్ళ తండ్రులు ఎంత గొప్పవాళ్ళో చర్చించుకుంటున్నారు. మొదటి కుర్రాడు “నీకు పసిఫిక్‌ సముద్రం తెలుసా? దానికోసం భూమిలో గొయ్యి తవ్వింది మా నాన్నే” అన్నాడు. రెండో కుర్రాడు కాసేపు ఆలోచించి “నీకు డెడ్‌ సీ తెలుసా? దాన్ని చంపింది మా నాన్నే” అన్నాడు. —————————————————– ఇద్దరు దొంగలు ప్లాన్‌ చేసి బ్యాంక్‌ నించి పెద్ద మొత్తంలో దొంగతనం చేశారు. అర్ధరాత్రికి ఇల్లు చేరారు. మొదటి దొంగ “మనమెంత దొంగతనం చేశామో లెక్కపెడదామా?” అన్నాడు. రెండో […]

ఇద్దరు కుర్రాళ్ళు వాళ్ళ తండ్రులు ఎంత గొప్పవాళ్ళో చర్చించుకుంటున్నారు.
మొదటి కుర్రాడు “నీకు పసిఫిక్‌ సముద్రం తెలుసా? దానికోసం భూమిలో గొయ్యి తవ్వింది మా నాన్నే” అన్నాడు.
రెండో కుర్రాడు కాసేపు ఆలోచించి
“నీకు డెడ్‌ సీ తెలుసా? దాన్ని చంపింది మా నాన్నే” అన్నాడు.
—————————————————–
ఇద్దరు దొంగలు ప్లాన్‌ చేసి బ్యాంక్‌ నించి పెద్ద మొత్తంలో దొంగతనం చేశారు.
అర్ధరాత్రికి ఇల్లు చేరారు. మొదటి దొంగ “మనమెంత దొంగతనం చేశామో లెక్కపెడదామా?” అన్నాడు.
రెండో అతను “బాగా అలసిపోయాను. పొద్దున్నే పేపర్లో చూద్దాంలే” అన్నాడు.
—————————————————–
“నేనొక డ్రింకును కనిపెట్టాను. దాన్ని ఒక్క చుక్క రుచి చూసినా నువ్వు నిజం చెబుతావు” అన్నాడు రవి.
రఘు ఆ డ్రింకు ఒక చుక్క నాలిక మీద వేసుకుని
“అరే! ఇది కిరోసిన్‌!” అన్నాడు.
“నేం చెప్పలా? అది రుచి చూస్తే నువ్వు నిజం చెబుతావని అన్నానా లేదా?” అన్నాడు రవి.
—————————————————–
“అందర్తో నేను బుద్ది హీనుడని చెబుతున్నావట ఏమిటి సంగతి?” గద్దించాడు చక్రవర్తి.
“అయాం సారీ! అది రహస్యమన్న సంగతి నాకు తెలీదు” అన్నాడు వేణు.
—————————————————–
ఇద్దరు పిల్లలు మ్యూజియంలో ఒక మమ్మీని చూస్తూ నిల్చున్నారు.
రాకేష్‌: ఆ మమ్మీ దగ్గర 1227 బి.సి. అని రాశారు. ఏమిటది?
అనిల్‌: బహుశా అతన్ని యాక్సిడెంట్‌ చేసిన కారు నెంబరనుకుంటాను.

First Published:  3 July 2015 6:33 PM IST
Next Story