మగబిడ్డ కోసం రెండో పెళ్లికి సిద్ధమైన కానిస్టేబుల్
మగపిల్లలు పుట్టలేదన్న కారణంతో తనను వదిలివేసి మరో పెళ్ళి చేసుకోవడానికి తన భర్త సిద్ధపడుతున్నాడంటూ ఓ కానిస్టేబుల్ భార్య మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. నలుగురు ఆడపిల్లలు పుట్టడంలో తన తప్పు ఏమిటో తనకు అర్దం కావడంలేదని, తనకు న్యాయం చేయాలని హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. మెదక్ జిల్లా గజ్వేల్ మండలం బేగంపేటకు చెందిన బాలలక్ష్మి, నర్సింహులు భార్యాభర్తలు. కానిస్టేబుల్ అయిన నర్సింహులు తనకు నలుగురు ఆడపిల్లలే పుట్టారని భార్యను వేధించడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు. రెండో […]
BY sarvi3 July 2015 1:31 PM GMT
sarvi Updated On: 4 July 2015 12:05 AM GMT
మగపిల్లలు పుట్టలేదన్న కారణంతో తనను వదిలివేసి మరో పెళ్ళి చేసుకోవడానికి తన భర్త సిద్ధపడుతున్నాడంటూ ఓ కానిస్టేబుల్ భార్య మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. నలుగురు ఆడపిల్లలు పుట్టడంలో తన తప్పు ఏమిటో తనకు అర్దం కావడంలేదని, తనకు న్యాయం చేయాలని హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. మెదక్ జిల్లా గజ్వేల్ మండలం బేగంపేటకు చెందిన బాలలక్ష్మి, నర్సింహులు భార్యాభర్తలు. కానిస్టేబుల్ అయిన నర్సింహులు తనకు నలుగురు ఆడపిల్లలే పుట్టారని భార్యను వేధించడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు. రెండో పెళ్లికి కూడా సిద్ధమయ్యాడు. భర్త మరో పెళ్లి చేసుకుంటే తమ గతేంటని, తాను, పిల్లలు రోడ్డున పడతామని ఆ ఫిర్యాదులో పేర్కొంది. రెండో పెళ్ళికి అడ్డు చెప్పడంతో తనను బెదిరిస్తున్నాడని, భర్త నుంచి ప్రాణహాని ఉన్నందున రక్షణ కల్పించాలని బాలలక్ష్మి కోరింది. ఆమె ఫిర్యాదుని పరిశీలించిన మానవహక్కుల సంఘం దీనిపై పూర్తి దర్యాప్తు జరిపి ఆగస్టు 26వ తేదీ లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని మెదక్ ఎస్పీని ఆదేశించింది.
Next Story