హేమమాలిని కారు డ్రైవర్ అరెస్ట్!
నిర్లక్ష్యంగా కారు నడిపి, నాలుగేళ్ల చిన్నారి మృతికి కారణమైన భాజపా ఎంపీ హేమమాలిని కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం రాత్రి హేమమాలిని ప్రయాణిస్తున్న కారు మరో కారును ఢీకొన్న ప్రమాదంలో చిన్నారి మృతిచెందిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో ఆమెకూ స్వల్పగాయాలయ్యాయి. డ్రైవర్ రమేశ్ చందూ ఠాకూర్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు కోత్వాలీ పోలీసులు తెలిపారు. అతనిపై ఐపీసీ 279, 304 సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. మీడియాపై నెటిజన్ల ఆగ్రహం! నాలుగేళ్ల చిన్నారి మరణానికి […]
BY Pragnadhar Reddy3 July 2015 6:36 PM IST
Pragnadhar Reddy Updated On: 4 July 2015 5:25 AM IST
నిర్లక్ష్యంగా కారు నడిపి, నాలుగేళ్ల చిన్నారి మృతికి కారణమైన భాజపా ఎంపీ హేమమాలిని కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం రాత్రి హేమమాలిని ప్రయాణిస్తున్న కారు మరో కారును ఢీకొన్న ప్రమాదంలో చిన్నారి మృతిచెందిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో ఆమెకూ స్వల్పగాయాలయ్యాయి. డ్రైవర్ రమేశ్ చందూ ఠాకూర్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు కోత్వాలీ పోలీసులు తెలిపారు. అతనిపై ఐపీసీ 279, 304 సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు.
మీడియాపై నెటిజన్ల ఆగ్రహం!
నాలుగేళ్ల చిన్నారి మరణానికి కారణమైన హేమమాలిని కారు డ్రైవర్ తప్పును ఎత్తి చూపకుండా ఆమెకు చిన్నగాయమైతే మీడియా ఎక్కడలేని హడావుడి చేస్తోందని నెటిజన్లు మండిపడ్డారు. నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది, ఆమె సోదరుడి కాళ్లు దెబ్బతిన్నాయి. వారి గురించి పట్టించుకోరా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలబ్రిటీ అయిన ఎంపీకి స్వల్పగాయాలైతే దాన్ని హైలైట్ చేస్తున్నారే తప్ప, సాధారణ ప్రజల ప్రాణాలకు విలువ లేదా? అని మీడియా వైఖరిని ఎండగట్టారు.
Next Story