Telugu Global
Others

ఈనెల 24 నుంచి స‌మ్మెకు సిద్ధ‌మైన‌ ఆరోగ్య‌శ్రీ  సిబ్బంది 

ప్ర‌భుత్వం ఈనెల 24వ తేదీ లోపు త‌మ డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించ‌క పోతే అదే రోజు అర్థ‌రాత్రి నుంచి  స‌మ్మె చేప‌డ‌తామ‌ని ఆరోగ్య‌శ్రీ  ఔట్ సోర్సింగ్  సిబ్బంది ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. ఆ శాఖ‌లో కీల‌క పాత్ర పోషిస్తున్న ఆరోగ్య‌మిత్రాలు, టీమ్ లీడ‌ర్లు, జిల్లా మేనేజ‌ర్ల వంటి 1450 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్న‌తోదోగ్యుల‌కు స‌మ్మె నోటీస్ ఇచ్చారు. ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కంలో ప‌నిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల‌ను ఆరోగ్య‌శ్రీ హెల్త్‌కేర్ ట్ర‌స్టు ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పించాలని, క‌నీస […]

ప్ర‌భుత్వం ఈనెల 24వ తేదీ లోపు త‌మ డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించ‌క పోతే అదే రోజు అర్థ‌రాత్రి నుంచి స‌మ్మె చేప‌డ‌తామ‌ని ఆరోగ్య‌శ్రీ ఔట్ సోర్సింగ్ సిబ్బంది ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. ఆ శాఖ‌లో కీల‌క పాత్ర పోషిస్తున్న ఆరోగ్య‌మిత్రాలు, టీమ్ లీడ‌ర్లు, జిల్లా మేనేజ‌ర్ల వంటి 1450 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్న‌తోదోగ్యుల‌కు స‌మ్మె నోటీస్ ఇచ్చారు. ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కంలో ప‌నిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల‌ను ఆరోగ్య‌శ్రీ హెల్త్‌కేర్ ట్ర‌స్టు ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పించాలని, క‌నీస వేత‌న చ‌ట్టాన్ని అమ‌లు చేయాలని, ఉద్యోగులంద‌రికీ ఆరోగ్య కార్డుల‌ను మంజూరు చేయాలని వారు డిమాండు చేస్తున్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగాలకు ద‌ర‌ఖాస్తు చేసుకునేట‌ప్పుడు వ‌యోప‌రిమితిలో తాము పని చేసిన కాలానికి స‌డ‌లింపునివ్వాల‌ని, ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన, మృతి చెందిన వారికి ప్ర‌మాద బీమా సౌక‌ర్యం క‌ల్పించాలని, అనుభ‌వం ఆధారంగా ఇంక్రిమెంట్లు ఇవ్వాల‌ని వారు త‌మ డిమాండ్ల‌లో పేర్కొన్నారు.
First Published:  3 July 2015 6:45 PM IST
Next Story