దొనకొండకు మహర్దశ!
ప్రకాశం జిల్లా దొనకొండకు మహర్దశ పట్టబోతున్నదా..? అక్కడ భారీ పరిశ్రమలు రాబోతున్నాయా..? అవుననే అంటున్నాయి అధికారవర్గాలు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని కోసం పరిశీలించిన ప్రాంతాల్లో దొనకొండ ప్రథమ స్థానంలో ఉంది. శివరామకృష్ణ కమిటీ కూడా దొనకొండే మేలని సూచించింది. అయితే అనేక మార్పులు చేర్పుల తర్వాత గుంటూరు జిల్లా తుళ్లూరు ప్రాంతం రాజధానిగా ఎంపికయ్యింది. కానీ దొనకొండకు రాజధాని భాగ్యం లేకపోయినా పరిశ్రమలు రానుండడంతో ఆ ప్రాంతానికి మహర్ధశ పట్టబోతున్నదని అధికారులంటున్నారు. దొనకొండ మండలంలో చైనా బృందం […]
BY Pragnadhar Reddy4 July 2015 4:04 AM IST

X
Pragnadhar Reddy Updated On: 4 July 2015 4:04 AM IST
ప్రకాశం జిల్లా దొనకొండకు మహర్దశ పట్టబోతున్నదా..? అక్కడ భారీ పరిశ్రమలు రాబోతున్నాయా..? అవుననే అంటున్నాయి అధికారవర్గాలు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని కోసం పరిశీలించిన ప్రాంతాల్లో దొనకొండ ప్రథమ స్థానంలో ఉంది. శివరామకృష్ణ కమిటీ కూడా దొనకొండే మేలని సూచించింది. అయితే అనేక మార్పులు చేర్పుల తర్వాత గుంటూరు జిల్లా తుళ్లూరు ప్రాంతం రాజధానిగా ఎంపికయ్యింది. కానీ దొనకొండకు రాజధాని భాగ్యం లేకపోయినా పరిశ్రమలు రానుండడంతో ఆ ప్రాంతానికి మహర్ధశ పట్టబోతున్నదని అధికారులంటున్నారు. దొనకొండ మండలంలో చైనా బృందం జరిపిన పర్యటనే ఇందుకు నిదర్శనం. ఆ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటుకుగల అనుకూలమైన సౌకర్యాలను చైనా బృందం పరిశీలించింది. చైనాకు చెందిన దెలియన్ వాండా కంపెనీ ప్రతినిది మ్యాఛ్చూఎబార్డ్, ఎపిఐఐసి ఎమ్‌డీ కెవి సత్యనారాయణతో పాటు ఢిల్లీకి చెందిన ఇద్దరు ప్రతినిధులు ప్రత్యేక హెలికాప్టర్‌లో దొనకొండ ప్రాంతంలో పర్యటించారు. రుద్ర సముద్రం, పోచమక్కపల్లె గ్రామాల పరిధిలోని ఐదువేల ఎకరాలకు భూముల మ్యాప్‌ను పరిశీలించారు. ఆ ప్రాంతంలోని మౌలిక సదుపాయాల గురించి ఆరా తీశారు. సాగర్ కాలువ, వెలుగొండ నుంచి అందే నీటి వనరుల గురించి తెలుసుకున్నారు. సమీపంలోని జాతీయ రహదారి, ప్రధాన రైలుమార్గంతో పాటు అదనంగా ఏర్పాటు కానున్న నడికుడి- శ్రీకాళహస్తి రైలు మార్గాల గురించి అధికారులు వివరించారు. పరిశీలన అనంతరం పరిశ్రమల ఏర్పాటుకు ఈ ప్రాంతం అనుకూలమన్న అభిప్రాయానికి చైనా బృందం వచ్చిందని ఎపిఐఐసి ఎమ్‌డీ సత్యనారాయణ వెల్లడించారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.
Next Story