సండ్రకు మరోసారి ఏసీబీ నోటీసులు
ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. సోమవారం సాయంత్రం 5 గంటల లోపు విచారణకు రావాలని ఈ నోటీసులో ఆదేశించింది. తొలిసారి సండ్రకు నోటీసులు పంపించినపుడు ఆయన ఇంట్లో లేపోవడంతో ఏసీబీ అధికారులు హైదరగూడలోని ఆయన నివాసంలో ఇంటి గోడకు నోటీసులు అతికించి వచ్చేశారు. ఈసారి కూడా మళ్ళీ అలాగే జరిగింది. తొలి నోటీసు తర్వాత ఆయన తన ఆరోగ్యం బాగోలేదని, […]
BY sarvi4 July 2015 10:57 AM IST
X
sarvi Updated On: 4 July 2015 11:16 AM IST
ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. సోమవారం సాయంత్రం 5 గంటల లోపు విచారణకు రావాలని ఈ నోటీసులో ఆదేశించింది. తొలిసారి సండ్రకు నోటీసులు పంపించినపుడు ఆయన ఇంట్లో లేపోవడంతో ఏసీబీ అధికారులు హైదరగూడలోని ఆయన నివాసంలో ఇంటి గోడకు నోటీసులు అతికించి వచ్చేశారు. ఈసారి కూడా మళ్ళీ అలాగే జరిగింది. తొలి నోటీసు తర్వాత ఆయన తన ఆరోగ్యం బాగోలేదని, వెన్ను నొప్పి, కాళ్ళు నొప్పులతో బాధ పడుతున్నానని, విచారణకు హాజరయ్యేందుకు తనకు పది రోజుల గడువు కావాలని ఏసీబీకి లేఖ రాశారు. అయితే పది రోజులైన తర్వాత కూడా ఆయన రాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో తిరిగారు. అయితే ఇటీవల మరోసారి ఏసీబీకి లేఖ రాస్తూ తాను రాజమండ్రి బొల్లినేని ఆస్పత్రిలో పది రోజులపాటు చికిత్స పొందానని, ఇపుడు తన ఆరోగ్యం కుదుట పడిందని, ఎప్పుడు రమ్మంటే అప్పుడు విచారణకు హాజరవుతానని సండ్ర పేర్కొన్నారు. దీనికి మూడు రోజుల తర్వాత ఏసీబీ స్పందించింది. ఇపుడు తాజాగా మరోసారి సండ్ర వెంకట వీరయ్యకు నోటీసులు పంపుతూ సోమవారం సాయంత్రం 5 గంటల లోపు ఏసీబీ కార్యాలయానికి వచ్చి విచారణకు సహకరించాలని అందులో పేర్కొంది. ఏసీబీ అధికారులు తమ నోటీసులు ఈసారి కూడా గోడకే అతికించి వచ్చారు. మరి ఈసారైనా వస్తారో లేదో చూడాలి!
Next Story