మద్యం దరఖాస్తుల విక్రయం ద్వారా రూ.259 కోట్లు
కొత్త అబ్కారీ విధానం ద్వారా రెండు వేల కోట్ల అదనపు ఆదాయాన్ని సంపాదించాలనుకుంటున్న ఏపీ ప్రభుత్వానికి మద్యం దరఖాస్తుల ద్వారానే దాదాపు 260 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఈ విషయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఎక్సైజ్ అధికారులతో ఆయన మాట్లాడుతూ.. లైసెన్స్ ఫీజుల ద్వారా రూ.364 కోట్ల ఆదాయం, దరఖాస్తుల ద్వారా 259 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. 343 షాపులకు దరఖాస్తులు రాలేదన్నారు. 434 మద్యం షాపులను ప్రభుత్వ నిర్వహిస్తుందని వివరించారు. ప్రభుత్వ మద్యం […]
BY sarvi2 July 2015 1:05 PM GMT
sarvi Updated On: 2 July 2015 11:53 PM GMT
కొత్త అబ్కారీ విధానం ద్వారా రెండు వేల కోట్ల అదనపు ఆదాయాన్ని సంపాదించాలనుకుంటున్న ఏపీ ప్రభుత్వానికి మద్యం దరఖాస్తుల ద్వారానే దాదాపు 260 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఈ విషయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఎక్సైజ్ అధికారులతో ఆయన మాట్లాడుతూ.. లైసెన్స్ ఫీజుల ద్వారా రూ.364 కోట్ల ఆదాయం, దరఖాస్తుల ద్వారా 259 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. 343 షాపులకు దరఖాస్తులు రాలేదన్నారు. 434 మద్యం షాపులను ప్రభుత్వ నిర్వహిస్తుందని వివరించారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పారదర్శకంగా అమ్మకాలు సాగేలే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగడానికి అవకాశం లేకుండా చూడాలని ఆయన సూచించారు.
Next Story