Telugu Global
Others

విభేదాలు అభివృద్ధికి అవ‌రోధాలు: రాష్ట్రప‌తి ఉద్బోధ‌

‘ఉనికి’ పుస్త‌కావిష్క‌ర‌ణ స‌భ‌లో తెలుగు రాష్ట్రాల వ్య‌వ‌హారంపై ప్ర‌ణ‌బ్ ప‌రోక్ష వ్యాఖ‌లు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య విభేదాల‌పై రాష్ట్రప‌తి ప‌రోక్ష వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్ అంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ ప్ర‌జ‌ల‌కే కాదు… దేశ ప్ర‌జ‌లంద‌రికీ కూడా ఎంతో అభిమాన‌మ‌ని, హైద‌రాబాద్ వివిధ సంస్కృతుల స‌మ్మెళ‌నం అని రాష్ట్రప‌తి అన్నారు. తెలుగు రాష్ట్రాలు క‌లిసి ఉంటేనే అభ్యున్న‌తి సాధ్య‌మ‌ని, క‌ల‌హించుకుంటే దాని ప్ర‌భావం అభివృద్ధిపై ప‌డుతుంద‌ని ఆయ‌న అన్నారు. ప‌ర‌స్ప‌ర త‌గాదాలు ఇరు రాష్ట్రాలకు ప్ర‌యోజ‌న‌క‌రం కాద‌ని ఆయ‌న […]

విభేదాలు అభివృద్ధికి అవ‌రోధాలు: రాష్ట్రప‌తి ఉద్బోధ‌
X
‘ఉనికి’ పుస్త‌కావిష్క‌ర‌ణ స‌భ‌లో తెలుగు రాష్ట్రాల వ్య‌వ‌హారంపై ప్ర‌ణ‌బ్ ప‌రోక్ష వ్యాఖ‌లు
తెలుగు రాష్ట్రాల మ‌ధ్య విభేదాల‌పై రాష్ట్రప‌తి ప‌రోక్ష వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్ అంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ ప్ర‌జ‌ల‌కే కాదు… దేశ ప్ర‌జ‌లంద‌రికీ కూడా ఎంతో అభిమాన‌మ‌ని, హైద‌రాబాద్ వివిధ సంస్కృతుల స‌మ్మెళ‌నం అని రాష్ట్రప‌తి అన్నారు. తెలుగు రాష్ట్రాలు క‌లిసి ఉంటేనే అభ్యున్న‌తి సాధ్య‌మ‌ని, క‌ల‌హించుకుంటే దాని ప్ర‌భావం అభివృద్ధిపై ప‌డుతుంద‌ని ఆయ‌న అన్నారు. ప‌ర‌స్ప‌ర త‌గాదాలు ఇరు రాష్ట్రాలకు ప్ర‌యోజ‌న‌క‌రం కాద‌ని ఆయ‌న అన్నారు. దేశాభివృద్ధికి రాష్ట్రాల సంబంధాలు బ‌ల‌ప‌డాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని రాష్ట్రప‌తి ఉద్ఘాటించారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జీ శుక్ర‌వారంనాడు మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు రచించిన ‘ఉనికి’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంత‌రం రాష్ట్రప‌తి మాట్లాడుతూ పార్ల‌మెంట్‌స‌భ్యుడిగా ఎన్నిక‌యిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న‌తో త‌న‌కు స‌త్సంబంధాలున్నాయ‌ని అన్నారు. ఈ పుస్త‌కావిష్క‌ర‌ణ‌కు హాజ‌రైనందుకు త‌న‌కు సంతోషంగా ఉంద‌ని ప్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జీ అన్నారు. విద్యాసాగ‌ర‌రావు రాసిన ఉనికి పుస్త‌కం రాజ‌కీయాల్లో ఉండేవారంద‌రికీ కొత్త స్ఫూర్తిని ఇస్తుంద‌ని తాను భావిస్తున్న‌ట్టు చెప్పారు. హెచ్‌ఐసీసీలో ఘనంగా జరిగిన‌ ఈ కార్యక్రమానికి హాజ‌రైన గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, కేంద్ర‌మంత్రి ద‌త్తాత్రేయ‌, కాంగ్రెస్ పార్టీ శాస‌న‌స‌భా ప‌క్ష నేత కె. జానారెడ్డి త‌దితరులు విద్యాసాగ‌ర‌రావును అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు.

ప్ర‌తి ఒక్క‌రు ప‌ది మందికీ ఉప‌యోగ‌ప‌డే ప‌ని చేయాల‌ని, ఇలా చేయ‌డం వ‌ల్లే మ‌న ఉనికి స‌మాజానికి తెలుస్తుంద‌ని గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ అన్నారు. ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలోనూ విద్యాసాగ‌ర‌రావుతో త‌న‌కు క‌లిసి ప‌నిచేసే అవ‌కాశం ల‌భించింద‌ని అన్నారు. ఉనికి చాటుకోవాల‌న్న ల‌క్ష్యంతో చేసిందే తెలంగాణ రాష్ట్ర సాధ‌న ఉద్య‌మం అని తాను చేసిన ఉద్య‌మంతో ఉనికికి ముడిపెట్టారు కేసీఆర్. విద్యాసాగ‌ర్ విల‌క్ష‌ణ‌మైన రాజ‌కీయ నాయ‌కుడ‌ని, తాను అనుకున్న సిద్దాంతం కోసం ప‌ని చేసిన వ్య‌క్త‌ని కేసీఆర్ అన్నారు. ఆయ‌న రాసిన పుస్త‌క‌రం భావి త‌రాల‌కు స్ఫూర్తినివ్వాల‌ని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప‌త్రంపై రాష్ట్రప‌తిగా సంత‌కం చేసిన ప్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జీని మ‌రువ‌లేమ‌ని ఈ సంద‌ర్భంగా కేసీఆర్ గుర్తు చేశారు. విద్యాసాగ‌ర‌రావు ఆలోచ‌నా విధాన‌మే ఆయ‌న‌కు ఈ స్థాయి తెచ్చింద‌ని కేంద్ర మంత్రి ద‌త్తాత్రేయ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉనికిని కూడా కాపాడుకోవ‌ల‌సిన అవ‌స‌రం త‌మంద‌రిపై ఉంద‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా అన్నారు. విద్యాసాగ‌ర‌రావుతో త‌న‌కు మూడు ద‌శాబ్దాల‌ అనుబంధం ఉంద‌ని టీ సీఎల్పీ నాయ‌కుడు జానారెడ్డి అన్నారు. అసెంబ్లీలో విద్యాసాగ‌ర‌రావు ఎంతో హూందాగా వ్య‌వ‌హ‌రించేవారిని జానా గుర్తు చేశారు. బ‌ల‌హీన‌ప‌డుతున్న ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌కు ఉనికి కొత్త శ‌క్తినిస్తుంద‌ని జానారెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు. రాష్ట్రప‌తి త‌న పుస్త‌కాన్ని ఆవిష్క‌రించ‌డం ద్వారా ఉనికికే ఉనికి ఏర్ప‌డింద‌ని పుస్త‌క ర‌చియిత‌, మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర‌రావు త‌న కృత‌జ్ఞాతాభినంద‌న సందేశంలో వ్యాఖ్యానించారు. త‌న పుస్త‌కంలో కేసీఆర్ ఆమ‌ర‌ణ దీక్ష గురించి కూడా ప్ర‌స్తావ‌న ఉంద‌ని వెల్ల‌డించారు. త‌న జీవితంలోని అన్ని ముఖ్య‌మైన సంఘ‌ట‌న‌ల‌ను, అనుభ‌వాల‌ను ఈ పుస్త‌కంలో పొందు ప‌రిచాన‌ని ఆయ‌న తెలిపారు. త‌న అనుభ‌వాలు ప‌ది మందికీ చేరాల‌న్న ల‌క్ష్యంతోనే తానీ పుస్త‌కం రాశాన‌ని ఆయ‌న చెప్పారు.
First Published:  3 July 2015 3:19 AM GMT
Next Story