Telugu Global
Others

చంద్ర‌బాబుపై  మండిప‌డ్డ నీతి అయోగ్ వైస్ చైర్మ‌న్ 

నీతి అయోగ్ వైస్ చైర్మ‌న్ అర‌వింద్ ప‌న‌గారియ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడ‌పై మండి ప‌డ్డారు. నీతిఅయోగ్ ఏర్పాటైన త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో ప‌ర్య‌టించాల‌ని అర‌వింద్ ప‌న‌గారియ నిర్ణ‌యించారు. అందులో భాగంగా త‌న తొలి ప‌ర్య‌ట‌న‌ను తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ల‌ను ఎంపిక చేశారు. ఆ స‌మాచారాన్ని రెండు  రాష్ట్రాల‌కు ముందుగానే  పంపి షెడ్యూలును ఖ‌రారు చేసుకున్నారు. ఆ  షెడ్యూలు ప్ర‌కారం తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంతో స‌మావేశ‌మ‌య్యారు. అనంత‌రం మ‌ధ్యాహ్నం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో […]

నీతి అయోగ్ వైస్ చైర్మ‌న్ అర‌వింద్ ప‌న‌గారియ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడ‌పై మండి ప‌డ్డారు. నీతిఅయోగ్ ఏర్పాటైన త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో ప‌ర్య‌టించాల‌ని అర‌వింద్ ప‌న‌గారియ నిర్ణ‌యించారు. అందులో భాగంగా త‌న తొలి ప‌ర్య‌ట‌న‌ను తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ల‌ను ఎంపిక చేశారు. ఆ స‌మాచారాన్ని రెండు రాష్ట్రాల‌కు ముందుగానే పంపి షెడ్యూలును ఖ‌రారు చేసుకున్నారు. ఆ షెడ్యూలు ప్ర‌కారం తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంతో స‌మావేశ‌మ‌య్యారు. అనంత‌రం మ‌ధ్యాహ్నం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో స‌మావేశమ‌వాల్సి ఉంది. అయితే, ఆ స‌మావేశానికి సీఎం చంద్ర‌బాబు రాకుండా కిందిస్థాయి సిబ్బందిని పంపారు. దీంతో విస్మ‌యం చెందిన వైస్ చైర్మ‌న్ ఏపీ సీఎం తీరుపై మండిప‌డ్డారు. ముందుగా ఖ‌రారైన స‌మావేశానికి స‌మాచారం ఇవ్వ‌కుండా సీఎం అందుబాటులో లేక పోవ‌డం త‌నను అవ‌మానించ‌డ‌మేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించిన‌ట్లు తెలిసింది
First Published:  2 July 2015 6:52 PM IST
Next Story