కేసీఆర్‌కు రూ. 6 కోట్లతో అధునాతన బస్సు!
పకడ్బందీ భద్రత, అన్ని విధాలా సౌకర్యం, అలసట రాకుండా సదుపాయాలు… ఈ కలబోతతో తెలంగాణ ప్రభుత్వం ఓ బస్సును తీర్చిదిద్దింది. ఇకనుంచి జిల్లాలకు పర్యటించేటప్పుడు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఈ బస్సునే ఉపయోగిస్తారు. దీనిని చండీగఢ్‌లోని జేసీబీఎల్ కంపెనీకి ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించారు. మెర్సిడెజ్ బెంజ్ కంపెనీకి చెందిన ఈ వాహనాన్ని బుల్లెట్ ప్రూఫ్‌గా మార్చి అధునాతన సౌకర్యాలను కల్పించారు. పేలుళ్లతో సహా ఎలాంటి దాడులనైనా తట్టుకోగల సత్తా దీని సొంతం. ఈ బస్సులోనే […]
BY sarvi3 July 2015 6:07 AM IST
X
sarvi Updated On: 3 July 2015 6:07 AM IST
పకడ్బందీ భద్రత, అన్ని విధాలా సౌకర్యం, అలసట రాకుండా సదుపాయాలు… ఈ కలబోతతో తెలంగాణ ప్రభుత్వం ఓ బస్సును తీర్చిదిద్దింది. ఇకనుంచి జిల్లాలకు పర్యటించేటప్పుడు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఈ బస్సునే ఉపయోగిస్తారు. దీనిని చండీగఢ్‌లోని జేసీబీఎల్ కంపెనీకి ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించారు. మెర్సిడెజ్ బెంజ్ కంపెనీకి చెందిన ఈ వాహనాన్ని బుల్లెట్ ప్రూఫ్‌గా మార్చి అధునాతన సౌకర్యాలను కల్పించారు. పేలుళ్లతో సహా ఎలాంటి దాడులనైనా తట్టుకోగల సత్తా దీని సొంతం. ఈ బస్సులోనే పడక గది, బాత్‌రూమ్, చిన్నపాటి సమావేశ మందిరం ఉంటాయి. ఈ బస్సు గురువారం హైదరాబాద్‌కు చేరుకుంది. మియాపూర్ డిపోలో దీనికి తెలంగాణ ఆర్టీసీ అధికారులు, సిబ్బంది లోపలా, బయటా తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇన్ని అధునాతన సౌకర్యాలతో రూపొందించిన ఈ బస్సుకు అయిన ఖర్చు అక్షరాలా ఆరు కోట్ల రూపాయలు!
Next Story