Telugu Global
National

కేజ్రివాల్‌ కరెంట్ బిల్లు రూ.1.35 లక్షలు

‘ఆమ్ ఆద్మీ’ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ క‌రెంట్ బిల్లు ఎంతో తెలుసా? ఆయ‌న బిల్లు వివ‌రాలు తెలిస్తే గుండె ఆగిపోతోంది. ఎందుకంటే మొన్న‌మొన్న‌టిదాకా సామాన్యుడిగా బ‌తికిన కేజ్రివాల్ అధికారం వ‌చ్చేస‌రికి అమాంతం మారిపోయారు. ఆయ‌న వినియోగించిన క‌రెంట్‌కు వ‌చ్చిన బిల్లుతో సామాన్యుడు దాదాపు సంవత్సరంపాటు కాలం బ‌తికేయ్యెచ్చు. గ‌తంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ రెండు నెలల కరెంటు బిల్లు దాదాపు లక్ష రావడంతో ఆశ్చర్యపోయిన వారికి ఇపుడు మ‌రో షాక్ ఇచ్చారు. జూన్ […]

కేజ్రివాల్‌ కరెంట్ బిల్లు రూ.1.35 లక్షలు
X

‘ఆమ్ ఆద్మీ’ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ క‌రెంట్ బిల్లు ఎంతో తెలుసా? ఆయ‌న బిల్లు వివ‌రాలు తెలిస్తే గుండె ఆగిపోతోంది. ఎందుకంటే మొన్న‌మొన్న‌టిదాకా సామాన్యుడిగా బ‌తికిన కేజ్రివాల్ అధికారం వ‌చ్చేస‌రికి అమాంతం మారిపోయారు. ఆయ‌న వినియోగించిన క‌రెంట్‌కు వ‌చ్చిన బిల్లుతో సామాన్యుడు దాదాపు సంవత్సరంపాటు కాలం బ‌తికేయ్యెచ్చు. గ‌తంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ రెండు నెలల కరెంటు బిల్లు దాదాపు లక్ష రావడంతో ఆశ్చర్యపోయిన వారికి ఇపుడు మ‌రో షాక్ ఇచ్చారు. జూన్ నెల కరెంట్ బిల్లును ఏకంగా 1.35 లక్షలకు పెంచి తన సత్తా చాటారు. ఢిల్లీలోని ఫ్లాగ్ స్టాఫ్ రోడ్‌లో గల ముఖ్యమంత్రి అధికార నివాసం కరెంటు బిల్లులు సామాన్యులనే కాదు ధనవంతులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. జూన్ నెలకుగాను దాదాపు 13 వేల యూనిట్ల విద్యుత్తును వినయోగించారు. ఆయన నివాసంలో దాదాపు 30 ఎయిర్ కండీషన్లు ఉన్నట్టు సమాచారం. వాటిలో 12-15 ఏసీలు ఎప్పుడూ వినియోగంలో ఉంటాయని తెలుస్తోంది. కాగా, ఇంత విద్యుత్తును వినయోగిస్తున్న ఆ ఇంటిలో ఎంతమంది ఉంటారనేది మాత్రం తెలియలేదు. మొత్తం మీద సామాన్యుల‌మ‌ని చెప్ప‌కుంటున్న ఆప్ నాయ‌కుల క‌రెంట్ బిల్లులు ఇపుడు కొత్త చ‌ర్చ‌కు తెర తీసే అవ‌కాశం లేక‌పోలేదు.

First Published:  3 July 2015 3:35 PM IST
Next Story