అధైర్య పడొద్దు... ర్యాంకులిస్తాం
జేఈఈ మెయిన్స్‌లో ర్యాంకులు గల్లంతైన తెలంగాణ విద్యార్థులకు సీబీఎస్ఈ అభయమిచ్చింది. గల్లంతైన ర్యాంకులను తిరిగి కేటాయిస్తామని హామీ ఇచ్చింది. సీబీఎస్ఈ అధికారుల హామీతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డు నిర్వాకంతో జేఈఈ మెయిన్స్‌లో ర్యాంకులు కోల్పోయిన విద్యార్థులకు తిరిగి ర్యాంకులు ఇచ్చేలా ఢిల్లీ వెళ్ళిన తెలంగాణ విద్యాశాఖ అధికారులు సీబీఎస్ఈ అధికారులను ఒప్పించగలిగారు. ఈ సంఘటనపై స్పందించిన ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ ఈనెల 4వ తేదీన విద్యార్థులకు ర్యాంకులు కేటాయిస్తారని, 4,5 తేదీల్లో […]
BY sarvi2 July 2015 6:51 PM IST
sarvi Updated On: 3 July 2015 3:44 PM IST
జేఈఈ మెయిన్స్‌లో ర్యాంకులు గల్లంతైన తెలంగాణ విద్యార్థులకు సీబీఎస్ఈ అభయమిచ్చింది. గల్లంతైన ర్యాంకులను తిరిగి కేటాయిస్తామని హామీ ఇచ్చింది. సీబీఎస్ఈ అధికారుల హామీతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డు నిర్వాకంతో జేఈఈ మెయిన్స్‌లో ర్యాంకులు కోల్పోయిన విద్యార్థులకు తిరిగి ర్యాంకులు ఇచ్చేలా ఢిల్లీ వెళ్ళిన తెలంగాణ విద్యాశాఖ అధికారులు సీబీఎస్ఈ అధికారులను ఒప్పించగలిగారు. ఈ సంఘటనపై స్పందించిన ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ ఈనెల 4వ తేదీన విద్యార్థులకు ర్యాంకులు కేటాయిస్తారని, 4,5 తేదీల్లో విద్యార్థులు ఆప్షన్స్ నమోదు చేసుకోవాలని అన్నారు. అర్హులైన విద్యార్థులకు మొదటి విడతలోనే సీట్ల కేటాయింపు ఉంటుందని ఆయన అన్నారు. ఇంటర్ బోర్డు తప్పిదం వల్లనే విద్యార్థులు మానసిక వేదనకు గురి కావాల్సి వచ్చిందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. విద్యార్థులకు ర్యాంకులు కేటాయించే వరకూ అధికారులు ఢిల్లీలోనే ఉంటారని, తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాలకు ఇదే సమస్య ఉత్పన్నం కావడంతో సీబీఎస్ఈ అధికారులు ర్యాంకులు కేటాయించేందుకు అంగీకరించారని కడియం చెప్పారు.
Next Story