ముస్లిం కుటుంబ వివాదాల పరిష్కారానికి కౌన్సిలింగ్ కేంద్రాలు
మైనారిటీవర్గానికి చెందిన దంపతుల మధ్య తలెత్తే వివాహ, కుటుంబ వివాదాలను తెలంగాణలో ఇక ప్రభుత్వమే పరిష్కరించనుంది. ముస్లిం పర్సనల్‌లా ప్రకారం పరిష్కరించేందుకు ప్రత్యేకంగా మ్యారేజ్ కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మొదటి మ్యారేజ్ కౌన్సిలింగ్ కేంద్రాన్ని నాంపల్లిలోని హజ్‌హౌస్‌లో ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కౌన్సిలింగ్ కేంద్రాలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. న్యాయం కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్న మహిళలకు మ్యారేజ్ కౌన్సిలింగ్ కేంద్రాలు సత్వర న్యాయం పొందేందుకు సహకరిస్తాయని పేర్కొన్నారు. […]
BY sarvi2 July 2015 6:37 PM IST
sarvi Updated On: 3 July 2015 5:26 AM IST
మైనారిటీవర్గానికి చెందిన దంపతుల మధ్య తలెత్తే వివాహ, కుటుంబ వివాదాలను తెలంగాణలో ఇక ప్రభుత్వమే పరిష్కరించనుంది. ముస్లిం పర్సనల్‌లా ప్రకారం పరిష్కరించేందుకు ప్రత్యేకంగా మ్యారేజ్ కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మొదటి మ్యారేజ్ కౌన్సిలింగ్ కేంద్రాన్ని నాంపల్లిలోని హజ్‌హౌస్‌లో ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కౌన్సిలింగ్ కేంద్రాలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. న్యాయం కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్న మహిళలకు మ్యారేజ్ కౌన్సిలింగ్ కేంద్రాలు సత్వర న్యాయం పొందేందుకు సహకరిస్తాయని పేర్కొన్నారు. విశ్రాంత న్యాయమూర్తి ఈ.ఇస్మాయిల్ నాయకత్వంలో ఈ కౌన్సిలింగ్ కేంద్రాల్లో సేవలందిస్తారని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఇలాంటి కౌన్సిలింగ్ సెంటర్‌లను ఏర్పాటు చేస్తామని మహమూద్ చెప్పారు.
Next Story