Telugu Global
Others

పగ తీర్చుకున్నారిలా...

త‌మ‌కు ఇష్టంలేని వారిని బ‌య‌ట‌కు పంపేందుకు ..వారికి ఇష్టంలేని నిర్ణ‌యాలు తీసుకుంటారు. ఇదే పొమ్మ‌న‌లేక పొగ‌పెట్ట‌డం. అయితే పొమ్మ‌న‌కుండానే పోయే వాళ్ల‌ను ఏమీ చేయ‌లేక వారి ఫోటోల‌కు పొగ‌పెడుతోంది కాంగ్రెస్ పార్టీ.  ఇదీ కాంగ్రెస్ పార్టీ మార్క్ డెమొక్ర‌సీ స్టైల్‌. తెలుగు రాష్ర్టాల్లో ఏ రాజ‌కీయ పార్టీ నుంచి ఎవ‌రు ఎప్పుడు ఎందుకు జంప్ చేస్తారో తెలియ‌ని ప‌రిస్థితి. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ..విక‌ర్శించే వ‌ర‌కూ ఇది సాగుతూనే ఉంటుంది. అయితే పార్టీకి అధ్య‌క్షులుగా ప‌నిచేసిన‌వారు కూడా జంప్ […]

పగ తీర్చుకున్నారిలా...
X

త‌మ‌కు ఇష్టంలేని వారిని బ‌య‌ట‌కు పంపేందుకు ..వారికి ఇష్టంలేని నిర్ణ‌యాలు తీసుకుంటారు. ఇదే పొమ్మ‌న‌లేక పొగ‌పెట్ట‌డం. అయితే పొమ్మ‌న‌కుండానే పోయే వాళ్ల‌ను ఏమీ చేయ‌లేక వారి ఫోటోల‌కు పొగ‌పెడుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇదీ కాంగ్రెస్ పార్టీ మార్క్ డెమొక్ర‌సీ స్టైల్‌. తెలుగు రాష్ర్టాల్లో ఏ రాజ‌కీయ పార్టీ నుంచి ఎవ‌రు ఎప్పుడు ఎందుకు జంప్ చేస్తారో తెలియ‌ని ప‌రిస్థితి. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ..విక‌ర్శించే వ‌ర‌కూ ఇది సాగుతూనే ఉంటుంది. అయితే పార్టీకి అధ్య‌క్షులుగా ప‌నిచేసిన‌వారు కూడా జంప్ జిలానీల లిస్టులో చేర‌డ‌మే ఇప్పుడు గంద‌ర‌గోళానికి కార‌ణ‌మ‌వుతోంది. వ‌ల‌స‌ల దెబ్బ‌కు 120 ఏళ్ల పైగా చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీ ఖ‌ల్లాస్ అవుతోంది. అయితే దీనిని ఆపేందుకు ఏంచేయాలో పాలుపోని నేత‌లు ..చివ‌రికి పార్టీ నుంచి వెళ్లిపోయిన నేత‌ల ఫోటోల‌కు పొగ‌పెట్టారు. స‌మైక్య రాష్ర్టంలో పీసీసీ చీఫ్‌లుగా ప‌నిచేసి ఆ త‌రువాత పార్టీ మారిన కేకే, బొత్స‌,డీఎస్ ఫోటోల‌ను గాంధీభ‌వ‌న్ నుంచి తొల‌గించాల‌ని ప్ర‌స్తుత కాంగ్రెస్ నేత‌లు తీర్మానించారు. పీసీసీ చీఫ్‌లు ప‌నిచేసిన వారి ఫోటోల‌ను గాంధీభ‌వ‌న్ సంవ‌త్స‌రాలు వారీగా ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచారు. ఈ ఫోటోల్లో పీసీసీ చీఫ్‌లు ప‌నిచేసిన కే కేశ‌వ‌రావు, డీ శ్రీనివాస్‌, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌లున్నారు. కేకే, డీఎస్ టీఆర్ ఎస్‌లో చేర‌గా, బొత్స వైఎస్సార్పీపీలో చేరారు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ నేతలు వారిపై అగ్గిమీద గుగ్గిల‌మ‌య్యారు. ఎన్నో ఉన్న‌త‌ప‌ద‌వులు, అవ‌కాశాలిచ్చిన పార్టీని కాద‌నుకుని వెళ్లిన వాళ్ల ఫోటోలు గాంధీభ‌వ‌న్‌లో ఉండ‌డానికి వీల్లేద‌ని తీర్మానించారు. ఆ ముగ్గురి ఫోటోలు ఇవాళో రేపో తొల‌గించ‌డం ఖాయం.

First Published:  3 July 2015 7:08 AM IST
Next Story