బాబు ఎర్రచందనం ఆలోచన అట్టర్‌ఫ్లాప్!
వేలానికి స్పందన నిల్…. ఆశించిన స్థాయిలో రాని ఆదాయం ఎర్ర చందనం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న దుంగలను విక్రయించి భారీగా సొమ్ము రాబట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేసుకున్న అంచనాలన్నీ తారుమారవుతున్నాయి. ఎర్రచందనం అమ్మకాల ద్వారా కనీసం రూ.2,500 కోట్లను ఆర్జించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే గతవారం తిరుపతిలో నిర్వహించిన వేలం పాట చూస్తే బాబుగారి ఆశలు నెరవేరే అవకాశాలు లేవని తేలిపోయింది. మొత్తం 3500 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దుంగల […]
BY Pragnadhar Reddy3 July 2015 12:58 AM IST
X
Pragnadhar Reddy Updated On: 3 July 2015 5:12 AM IST
వేలానికి స్పందన నిల్…. ఆశించిన స్థాయిలో రాని ఆదాయం
ఎర్ర చందనం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న దుంగలను విక్రయించి భారీగా సొమ్ము రాబట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేసుకున్న అంచనాలన్నీ తారుమారవుతున్నాయి. ఎర్రచందనం అమ్మకాల ద్వారా కనీసం రూ.2,500 కోట్లను ఆర్జించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే గతవారం తిరుపతిలో నిర్వహించిన వేలం పాట చూస్తే బాబుగారి ఆశలు నెరవేరే అవకాశాలు లేవని తేలిపోయింది. మొత్తం 3500 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దుంగల విక్రయానికి ఏర్పాట్లు చేయగా కేవలం 840 మెట్రిక్ టన్నులు మాత్రమే అమ్ముడయ్యాయి. శేషాచలం అడవుల్లో స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న 8584 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దుంగలను విక్రయించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నాణ్యమైన ఎర్రచందనానికి అంతర్జాతీయ మార్కెట్లో భారీగా రేటు పలుకుతున్న నేపథ్యంలో వాటిని విక్రయించి సొమ్ము చేసుకోవాలనేది చంద్రబాబు ఆలోచన. ప్రత్యేకించి చైనాలో ఎర్రచందనానికి మంచి డిమాండ్ ఉన్నందున ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ అధికారులు ఆ దేశంలో పర్యటించి వచ్చారు కూడా. గత ఏడాది మొత్తం 4159 మెట్రిక్ టన్నులను విక్రయించ డానికి ఇ-వేలంపాటలు, ఇ-టెండర్లను నిర్వహించగా కొనుగోలుదారులు భారీగానే దరఖాస్తులను దాఖలు చేశారు. అయితే డిపోల్లో నిల్వ ఉంచిన ఎర్రచందనం దుంగల నాణ్యతను పరిశీలించిన అనంతరం కొనుగోలుదారులు వెనక్కి తగ్గారు. నాణ్యత లేనందువల్ల మంచి ధర పెట్టి కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది సిద్ధ పడలేదు. దీనితో తొలివిడత కేవలం 2693 మెట్రిక్ టన్నులు మాత్రమే అమ్ముడైంది. ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు. రెండో విడత కింద 3500 మెట్రిక్ టన్నులను విక్రయించడం కోసం తిరుపతిలోని డిపోలో ఉంచారు. ఇ-వేలం పాటలు, ఇ- టెండర్లను నిర్వహించింది. అయిన ప్పటికీ కొనుగోలుదారుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. 3500 మెట్రిక్ టన్నులకు గాను 840 మెట్రిక్ టన్నులే అమ్ముడు పోయింది. దాంతో మరో విడత ఇ-టెండర్లు, ఇ-వేలం పాటలను నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదని సమచారం.
Next Story