బనియన్, తువ్వాలు మాత్రమే వదిలారు!
చేయి తిరిగిన దొంగలు చేతికి చిక్కిన వస్తువులను క్షణాల్లో మాయం చేస్తారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో జరిగిన చోరీ ఇందుకు నిదర్శనం. బ్యాగుబయటపెట్టి స్నానానికివెళ్లి వచ్చేలోగా దాన్ని మాయం చేశారు. దీంతో బాధితుడు తువ్వాలు, బనియన్‌తోనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. ప్రకాశం జిల్లా దర్శికిచెందిన యోగేశ్వర్‌రావు (25) ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగి. కంపెనీ పనిమీద హైదరాబాద్ వచ్చాడు. సికింద్రాబాద్ స్టేషన్‌లో దిగి రిజర్వేషన్ ప్రయాణికుల విశ్రాంతి గదిలో బ్యాగును ఉంచాడు. స్నానానికి వెళ్లి […]
BY Pragnadhar Reddy1 July 2015 6:36 PM IST
Pragnadhar Reddy Updated On: 2 July 2015 3:40 AM IST
చేయి తిరిగిన దొంగలు చేతికి చిక్కిన వస్తువులను క్షణాల్లో మాయం చేస్తారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో జరిగిన చోరీ ఇందుకు నిదర్శనం. బ్యాగుబయటపెట్టి స్నానానికివెళ్లి వచ్చేలోగా దాన్ని మాయం చేశారు. దీంతో బాధితుడు తువ్వాలు, బనియన్‌తోనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. ప్రకాశం జిల్లా దర్శికిచెందిన యోగేశ్వర్‌రావు (25) ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగి. కంపెనీ పనిమీద హైదరాబాద్ వచ్చాడు. సికింద్రాబాద్ స్టేషన్‌లో దిగి రిజర్వేషన్ ప్రయాణికుల విశ్రాంతి గదిలో బ్యాగును ఉంచాడు. స్నానానికి వెళ్లి వచ్చి చూసేసరికి బ్యాగు కనిపించలేదు. బట్టలు, నగదు, సెల్‌ఫోన్ కూడా అందులోనే ఉండటంతో ఆయనకు ఏంచేయాలో పాలుపోలేదు. చేసేది లేక అర్దనగ్నంగా రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు స్పందించిన ఆయనకు కొత్తబట్టలు ఇప్పించారు. అనంతరం యోగేశ్వరరావు ఆ బట్టల్లోనే కంపెనీ సమావేశానికి హాజరయ్యాడు. దొంగలు తువ్వాలు కూడా వదలకుండా ఉండి ఉంటే మనోడి పరిస్థితి ఎలా ఉండేదో పాపం!
Next Story