తుళ్లూరులో స్మార్ట్ పోలీస్ స్టేషన్
నవ్యాంధ్ర నూతన రాజధాని తుళ్లూరులో స్మార్ట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అంగీకరించింది. ఈ స్టేషన్ నిర్మాణానికి కోటి రూపాయలు కేటాయించనుంది. స్మార్ట్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి తుళ్లూరును ఎంపిక చేయాలని కోరుతూ డీజీపీ కార్యాలయం ప్రతిపాదనలు పంపడంతో కేంద్ర హోం శాఖ సానుకూలంగా స్పందించింది. గత ఏడాది నవంబర్‌లో జరిగిన అన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశంలో ప్రధాని మోడీ స్మార్ట్ పోలీస్ స్టేషన్ల ప్రతిపాదన తీసుకువచ్చారు. దర్యాప్తులతో పాటు పోలీసు […]
BY sarvi1 July 2015 1:19 PM GMT
sarvi Updated On: 2 July 2015 4:30 AM GMT
నవ్యాంధ్ర నూతన రాజధాని తుళ్లూరులో స్మార్ట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అంగీకరించింది. ఈ స్టేషన్ నిర్మాణానికి కోటి రూపాయలు కేటాయించనుంది. స్మార్ట్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి తుళ్లూరును ఎంపిక చేయాలని కోరుతూ డీజీపీ కార్యాలయం ప్రతిపాదనలు పంపడంతో కేంద్ర హోం శాఖ సానుకూలంగా స్పందించింది. గత ఏడాది నవంబర్‌లో జరిగిన అన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశంలో ప్రధాని మోడీ స్మార్ట్ పోలీస్ స్టేషన్ల ప్రతిపాదన తీసుకువచ్చారు. దర్యాప్తులతో పాటు పోలీసు సేవలన్నీ సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించడం ఈ పోలీస్ స్టేషన్ల లక్ష్యం.
Next Story