Telugu Global
Others

ర్యాంకులు  గ‌ల్లంతు

జాతీయ స్థాయి విద్యాసంస్థ‌లైన ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్ర‌వేశం కోసం రాసిన  జేఈఈ మెయిన్ ప‌రీక్షా ఫ‌లితాల్లో తెలంగాణ‌ విద్యార్థుల‌కు తీర‌ని అన్యాయం జ‌రిగింది. బుధ‌వారం విడుద‌లైన జేఈఈ మెయిన్ ప‌రీక్షా ఫ‌లితాల్లో   వేలాదిమంది విద్యార్థుల ర్యాంకులు గ‌ల్లంత‌య్యాయి.చాలా మంది విద్యార్థుల‌కు ర్యాంకులు కేటాయించ‌లేదు. దీంతో విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చెందుతున్నారు. జేఈఈ మెయిన్ తుది ర్యాంకుల ఖ‌రారులో వెయిటేజీ కోసం ఇంట‌ర్ మార్కుల‌ను పంప‌డంలో రాష్ట్ర ఇంట‌ర్ బోర్డు చేసిన పొర‌పాటే దీనికి కార‌ణ‌మని […]

జాతీయ స్థాయి విద్యాసంస్థ‌లైన ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్ర‌వేశం కోసం రాసిన జేఈఈ మెయిన్ ప‌రీక్షా ఫ‌లితాల్లో తెలంగాణ‌ విద్యార్థుల‌కు తీర‌ని అన్యాయం జ‌రిగింది. బుధ‌వారం విడుద‌లైన జేఈఈ మెయిన్ ప‌రీక్షా ఫ‌లితాల్లో వేలాదిమంది విద్యార్థుల ర్యాంకులు గ‌ల్లంత‌య్యాయి.చాలా మంది విద్యార్థుల‌కు ర్యాంకులు కేటాయించ‌లేదు. దీంతో విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చెందుతున్నారు. జేఈఈ మెయిన్ తుది ర్యాంకుల ఖ‌రారులో వెయిటేజీ కోసం ఇంట‌ర్ మార్కుల‌ను పంప‌డంలో రాష్ట్ర ఇంట‌ర్ బోర్డు చేసిన పొర‌పాటే దీనికి కార‌ణ‌మని ఆరోపిస్తూ బుధ‌వారం రాత్రి విద్యార్ధులు సెక్ర‌టేరియ‌ట్‌, ఇంట‌ర్ బోర్డు వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగారు.జేఈఈ మెయిన్ మార్కుల‌కు 60శాతం వెయిటేజీ, ఇంట‌ర్ మార్కుల‌కు 40 శాతం వెయిటేజీ ఇచ్చి ఆలిండియా ర్యాంకుల‌ను ఖ‌రారు చేస్తారు. ఇంట‌ర్ బోర్డు రాష్ట్ర విద్యార్ధుల మార్కుల‌ను పంపడంలో చేసిన పొర‌పాటు వ‌ల‌నే ఈ అన‌ర్థం జ‌రిగిందని విద్యార్థులు ఆరోపించారు. దీనిపై స్పందించిన ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీహ‌రి జేఈఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన సీబీఎస్ఈతో మాట్లాడ‌తాన‌ని, అధికారుల‌ను ఢిల్లీకి పంపి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని విద్యార్ధుల‌కు హామీ ఇచ్చారు.

First Published:  1 July 2015 1:04 PM GMT
Next Story