కూరలు, పప్పులు, మాంసం ధరలన్నీ పైపైకే
నిత్యావసర ధరలు చుక్కలను అంటుతూ సామాన్యుడి కంట్లో కన్నీరు తెప్పిస్తున్నాయి. సామాన్యుల కనీస అవసరాలైన ఆకుకూరలు, కూరగాయలు, పప్పులతో సహా మాంసాహారం ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఉల్లి, పచ్చిమిర్చి ఘాటెక్కిన ధరతో కంటతడి పెట్టిస్తున్నాయి. అల్లం, వెల్లుల్లి ధరలు రూ. 160కి పైమాటే. టమోటాలతో పాటు ఏ కూరగాయలు కదిలించినా కిలో ధర రూ. 40కు తక్కువ లేదు కూరగాయలు కొనలేం పప్పుతో సరిపెడదామంటే పప్పు ధాన్యాల ధరలు రూ. 120 పైమాటే. పప్పులో పెట్టుకోవడానికి గోంగూర, […]
BY sarvi1 July 2015 1:18 PM GMT
sarvi Updated On: 2 July 2015 4:28 AM GMT
నిత్యావసర ధరలు చుక్కలను అంటుతూ సామాన్యుడి కంట్లో కన్నీరు తెప్పిస్తున్నాయి. సామాన్యుల కనీస అవసరాలైన ఆకుకూరలు, కూరగాయలు, పప్పులతో సహా మాంసాహారం ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఉల్లి, పచ్చిమిర్చి ఘాటెక్కిన ధరతో కంటతడి పెట్టిస్తున్నాయి. అల్లం, వెల్లుల్లి ధరలు రూ. 160కి పైమాటే. టమోటాలతో పాటు ఏ కూరగాయలు కదిలించినా కిలో ధర రూ. 40కు తక్కువ లేదు కూరగాయలు కొనలేం పప్పుతో సరిపెడదామంటే పప్పు ధాన్యాల ధరలు రూ. 120 పైమాటే. పప్పులో పెట్టుకోవడానికి గోంగూర, పాల కూర పట్టుకుందామంటే భయమేస్తోంది. రెండు నెలల క్రితం వరకూ కట్ట రూ. 5 పలికిన ఆకు కూరలు ఇప్పడు రూ. 15 పలుకుతోందంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. వీటితో పాటే ఎప్పుడూ లేని విధంగా చికెన్, మటన్ ధరలు కూడా అనూహ్యంగా పెరిగిపోయాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా కూరగాయల సాగు ఆశాజనకంగా లేక పోవడం, పంటల విస్తీర్ణం తక్కువగా ఉండటంతో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయని వ్యాపారులంటున్నారు.
Next Story