Telugu Global
Others

ఆన్‌లైన్లో  ఫార్మ‌సిస్టుల లైసైన్స్‌లు

ఫార్మాసిస్టుల లైసెన్సుల కోసం ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకునే  నూత‌న విధానాన్ని ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెడుతోంద‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి ప్ర‌కటించారు. మందుల షాపు త‌దిత‌ర వ్యాపారాల‌ నిర్వ‌హ‌ణ అనుమ‌తుల  కోసం ఫార్మాసిస్టులు ఇబ్బంది ప‌డ‌కుండా అనుమతి ప్ర‌క్రియ‌ను సుల‌భ‌త‌రం చేస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. ఫార్మ‌సిస్టులు త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్‌లైన్ ద్వారా డ్ర‌గ్స్ కార్యాల‌యానికి పంపొచ్చ‌ని, వారి ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించి అనుమ‌తి రాగానే ఆన్‌లైన్ ద్వారా తెలియ‌చేస్తామ‌ని మంత్రి తెలిపారు. ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి […]

ఫార్మాసిస్టుల లైసెన్సుల కోసం ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకునే నూత‌న విధానాన్ని ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెడుతోంద‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి ప్ర‌కటించారు. మందుల షాపు త‌దిత‌ర వ్యాపారాల‌ నిర్వ‌హ‌ణ అనుమ‌తుల కోసం ఫార్మాసిస్టులు ఇబ్బంది ప‌డ‌కుండా అనుమతి ప్ర‌క్రియ‌ను సుల‌భ‌త‌రం చేస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. ఫార్మ‌సిస్టులు త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్‌లైన్ ద్వారా డ్ర‌గ్స్ కార్యాల‌యానికి పంపొచ్చ‌ని, వారి ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించి అనుమ‌తి రాగానే ఆన్‌లైన్ ద్వారా తెలియ‌చేస్తామ‌ని మంత్రి తెలిపారు. ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి వ‌చ్చిన త‌ర్వాత లైసెన్స్ పొంద‌డానికి అభ్య‌ర్ధులు ఒరిజిన‌ల్ స‌ర్టిఫికెట్లు తీసుకురావాల్సి ఉంటుంద‌ని, అధికారులు వాటిని ప‌రిశీలించిన అనంత‌రం లైసెన్స్ మంజూరు చేస్తార‌ని ఆయ‌న వివ‌రించారు.
First Published:  1 July 2015 6:42 PM IST
Next Story