Telugu Global
Others

పోలీసు బాసులతో కేసీఆర్‌ కీలక భేటీ!

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అనూహ్యంగా గురువారం పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం జరపడం చర్చనీయాంశమైంది.  హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న ముఖ్యమైన‌ ఐపీఎస్ ఆఫీసర్లతో ఆయన సంప్రదింపులు జరపడం ఆసక్తికరంగా మారింది. గురువారం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి అవినీతి నిరోధక శాఖ డి.జి. ఏ.కె.ఖాన్‌, హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్లు, హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని డీసీపీలు కూడా హాజరయ్యారు. ఇటీవలే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్‌ త్రివేది కూడా ఈ సమావేశానికి రావడం […]

పోలీసు బాసులతో కేసీఆర్‌ కీలక భేటీ!
X
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అనూహ్యంగా గురువారం పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం జరపడం చర్చనీయాంశమైంది. హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న ముఖ్యమైన‌ ఐపీఎస్ ఆఫీసర్లతో ఆయన సంప్రదింపులు జరపడం ఆసక్తికరంగా మారింది. గురువారం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి అవినీతి నిరోధక శాఖ డి.జి. ఏ.కె.ఖాన్‌, హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్లు, హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని డీసీపీలు కూడా హాజరయ్యారు. ఇటీవలే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్‌ త్రివేది కూడా ఈ సమావేశానికి రావడం గమనార్హం. ఓటుకు నోటు కేసులో ఇప్పటివరకు సాధించిన పురోగతి, సెక్షన్‌ 8 అమలుపై జరుగుతున్న రగడ, బుధవారం బెయిల్‌పై విడుదలైన రేవంత్‌రెడ్డి తనపైన, ఇతర మంత్రులపైన చెలరేగి చేసిన ఆరోపణలు… తదితర అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయని అంటున్నారు. అసలు ర్యాలీకి అనుమతి లేకపోయినా భారీ ర్యాలీ ఎలా నిర్వహించగలిగారని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించినట్టు సమాచారం. రేవంత్‌రెడ్డికి బెయిల్‌ వచ్చే అవకాశాలను సరిగా పసిగట్టలేకపోయారని అన్నట్టు తెలిసింది. ఇప్పటికైనా సుప్రీంకోర్టులో తగినన్ని ఆధారాలతో బెయిలు రద్దుకు ప్రయత్నించమని చూచాయగా కేసీఆర్‌ ఏసీబీ బాస్‌ ఏ.కె. ఖాన్‌కు తెలిపారని అంటున్నారు. మొత్తం మీద రానున్న రోజుల్లో ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు సంభవించే అవకాశం ఉన్నందున ఎలా వ్యవహరించాలన్న అంశంపై కేసీఆర్‌ కొన్ని సూచనలు చేసినట్టు తెలిసింది.
First Published:  2 July 2015 11:27 AM IST
Next Story