కూలీల బిడ్డలకు స్కాలర్‌షిప్‌లు
తెలంగాణ మార్కెట్ యార్డుల్లో పని చేసే హమాలీల ఆడబిడ్డల కోసం ప్రత్యేకంగా స్కాలర్ షిప్‌లను ప్రవేశపెడుతున్నామని రాష్ట్ర మంత్రి హరీశ్ వెల్లడించారు. అందరి ఆడబిడ్డల్లా హమాలీల ఆడపిల్లలు కూడా బాగా చదివి వృద్థిలోకి రావాలన్నదే ప్రభుత్వ ఆశయమని అందుకోసం వారికి ప్రత్యేక స్కాలర్‌షిప్‌లను ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. కులం, మతం వంటి తేడాలు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ కమిటీల్లో పని చేస్తున్న హమాలీల ఆడపిల్లలకు ఇంటర్‌కు రూ.2 వేలు, డిగ్రీకి రూ.3 వేలు, పీజీకి రూ.5 వేలు […]
BY sarvi1 July 2015 6:38 PM IST
sarvi Updated On: 2 July 2015 5:26 AM IST
తెలంగాణ మార్కెట్ యార్డుల్లో పని చేసే హమాలీల ఆడబిడ్డల కోసం ప్రత్యేకంగా స్కాలర్ షిప్‌లను ప్రవేశపెడుతున్నామని రాష్ట్ర మంత్రి హరీశ్ వెల్లడించారు. అందరి ఆడబిడ్డల్లా హమాలీల ఆడపిల్లలు కూడా బాగా చదివి వృద్థిలోకి రావాలన్నదే ప్రభుత్వ ఆశయమని అందుకోసం వారికి ప్రత్యేక స్కాలర్‌షిప్‌లను ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. కులం, మతం వంటి తేడాలు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ కమిటీల్లో పని చేస్తున్న హమాలీల ఆడపిల్లలకు ఇంటర్‌కు రూ.2 వేలు, డిగ్రీకి రూ.3 వేలు, పీజీకి రూ.5 వేలు చొప్పున ప్రభుత్వం ఉపకారవేతనాన్ని అందిస్తుందని ఆయన తెలిపారు. అంతేకాకుండా గ్రూప్ 1 మెయిన్స్ కోచింగ్ తీసుకునే వారికి రూ. 50 వేలు, సివిల్స్‌కు ప్రిపేరవుతుంటే రూ. లక్ష ఉపకార వేతనం ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలిపారు.
Next Story