డిజిటల్ ఇండియాకు రూ.4.5 లక్షల కోట్లు
ప్రధానమంత్రి మోడి చేపట్టిన డిజిటల్ ఇండియాకు పారిశ్రామిక వేత్తల నుంచి అనూహ్య మద్దతు లభించింది. ప్రజలందరికీ ఫోన్, వేగవంతమైన ఇంటర్నెట్ అందుబాటులోకి తేవడం, ప్రభుత్వ సేవలు, రోజువారీ కార్యక్రమాలు సులభతరం చేయడానికి వీలుగా తామంతా రూ. 4.5 లక్షల కోట్లను పెట్టుబడి పెడతామని పారిశ్రామికవేత్తలు ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. ఇందులో మేజర్ వాటా రిలయన్స్ ఇండస్ట్రీ రూ. 2,50,000 కోట్లను, ఆదిత్య బిర్లా గ్రూపు రూ. 46,000 కోట్లను, భారతీ ఎయిర్‌టెల్ సంస్థ వచ్చే ఐదేళ్లలో రూ. […]
BY sarvi1 July 2015 1:14 PM GMT
sarvi Updated On: 2 July 2015 2:44 AM GMT
ప్రధానమంత్రి మోడి చేపట్టిన డిజిటల్ ఇండియాకు పారిశ్రామిక వేత్తల నుంచి అనూహ్య మద్దతు లభించింది. ప్రజలందరికీ ఫోన్, వేగవంతమైన ఇంటర్నెట్ అందుబాటులోకి తేవడం, ప్రభుత్వ సేవలు, రోజువారీ కార్యక్రమాలు సులభతరం చేయడానికి వీలుగా తామంతా రూ. 4.5 లక్షల కోట్లను పెట్టుబడి పెడతామని పారిశ్రామికవేత్తలు ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. ఇందులో మేజర్ వాటా రిలయన్స్ ఇండస్ట్రీ రూ. 2,50,000 కోట్లను, ఆదిత్య బిర్లా గ్రూపు రూ. 46,000 కోట్లను, భారతీ ఎయిర్‌టెల్ సంస్థ వచ్చే ఐదేళ్లలో రూ. లక్ష కోట్లను ఖర్చు చేయనుంది. అనిల్ అంబానీ నేతృత్వంలోని అడాగ్ సంస్థ రూ. 10,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది. ఈ పెట్టుబడుల ద్వారా 18 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Next Story