శ్రీనన్న బాటలోమరి కొందరు
తెలంగాణ కాంగ్రెస్‌కు పెద్దదిక్కుగా వ్యవహరించిన పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ ఈ నెల 6న టీఆర్ ఎస్‌లో చేరనున్నారు. కాంగ్రెస్‌లో జరిగిన అవమానాల వల్లే తాను పార్టీని వీడుతున్నట్లు సోనియాగాంధీకి రాసిన లేఖలో వివరించారు. విద్యార్థి విభాగం నుంచి మంత్రిగా పార్టీలో అనేక బాధ్యతలు నిర్వర్తించానని గుర్తుచేశారు. రెండు సార్లు పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించినా తనకు సరైన గుర్తింపునివ్వలేదని వాపోయారు. దిగ్విజయ్ తనను తొక్కిపెట్టాలని చూశారని ఆరోపించారు. మండలి నేతగా షబ్బీర్ ఎంపిక, […]
BY Pragnadhar Reddy1 July 2015 9:44 PM GMT
X
Pragnadhar Reddy Updated On: 1 July 2015 9:44 PM GMT
తెలంగాణ కాంగ్రెస్‌కు పెద్దదిక్కుగా వ్యవహరించిన పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ ఈ నెల 6న టీఆర్ ఎస్‌లో చేరనున్నారు. కాంగ్రెస్‌లో జరిగిన అవమానాల వల్లే తాను పార్టీని వీడుతున్నట్లు సోనియాగాంధీకి రాసిన లేఖలో వివరించారు. విద్యార్థి విభాగం నుంచి మంత్రిగా పార్టీలో అనేక బాధ్యతలు నిర్వర్తించానని గుర్తుచేశారు. రెండు సార్లు పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించినా తనకు సరైన గుర్తింపునివ్వలేదని వాపోయారు. దిగ్విజయ్ తనను తొక్కిపెట్టాలని చూశారని ఆరోపించారు. మండలి నేతగా షబ్బీర్ ఎంపిక, ఇటీవలి ఎమ్మెల్సీ పదవి ఆకుల లలితకు కేటాయింపు లాంటి పరిణామాలు తనను తీవ్ర మనస్తాపానికి గురిచేశాయని లేఖలో వివరించారు.
దానం, సుదర్శన్‌రెడ్డిలు కూడా..!
బల్దియా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ లోని అసంతృప్తులకు టీఆర్ ఎస్ ఆహ్వానం పలుకుతోంది. కాంగ్రెస్‌లో అందరికీ పెద్దన్నలా వ్యవహరించిన శ్రీనన్నతోపాటు మరికొందరు నేతలు ఆయన వెంట వెళ్తారని సమాచారం. గ్రేటర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, మాజీఎమ్మెల్యే (నందీశ్వర్ గౌడ్)లు కూడా ఉన్నట్లు తెలిసింది. వీరిలో నందీశ్వర్‌గౌడ్ 2014లో టీఆర్ ఎస్ టికెట్ పై హామీ ఇచ్చింది. కానీ రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగి నచ్చజెప్పడంతో కాంగ్రెస్ నుంచే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వీరిలో మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి మినహాయిస్తే.. మిగిలిన ముగ్గరు గ్రేటర్‌లోని కాంగ్రెస్ ఓటు బ్యాంకును ప్రభావితం చేయగలరు. సిటీలో దానం వెంబడి సొంత సామాజిక వర్గం మున్నూరు కాపుతో పాటు, మరో బలమైన బీసీ కులమైన యాదవులు అతని వెంటే ఉంటారు. క్రితం సారి గ్రేటర్ ఎన్నికల్లో కార్పోరేటర్లుగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో దానం గెలిపించుకున్న వారిలో ఈ కులాలా వారే అధికం. దానంకు ఉన్న చరిష్మాకు తెలంగాణ వాదం తోడైతే.. అక్కడ టీఆర్ ఎస్‌కు విజయావకాశాలు మెరుగవుతాయి. ఇక నందీశ్వర్‌గౌడ్ నియోజకవర్గమైన పఠాన్‌చెరువు గ్రేటర్ పరిధిలోనే ఉంది. అక్కడ టీఆర్ ఎస్ ఎమ్మెల్యేనే ఉన్నప్పటికీ.. నందీశ్వర్ బలం తోడైతే కార్పోరేషన్లో గెలుపు నల్లేరు మీద నడకే.! అందుకే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా సాధ్యమైనంత మందిని పార్టీలోకి ఆహ్వానించి గ్రేటర్లో టీఆర్ ఎస్ జెండా ఎగరేయాలన్నది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది!
Next Story