కేసీఆర్ వెనకడుగుకు అదే కారణమా ?
ఓటుకు కోట్లు ఉదంతంలో తెలంగాణ ఏసీబీ ఎందుకు నిదానించింది? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేయదగినన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్న తెలంగాణ మంత్రులు ఎవరూ ఎందుకు మాట్లాడడం లేదు? ట‌్యాపింగ్‌కు సంబంధించి తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలలో కొంతయినా నిజముండే అవకాశాలున్నాయని, అవి బైటపడితే మొదటికే మోసం వస్తుందని తెలుసుకుని ఓటుకు కోట్లు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేయడం లేదని అధికారవర్గాలలో వినిపిస్తున్నది. తెలంగాణ హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిని రాష్ట్ర ప్రభుత్వం […]
BY Pragnadhar Reddy1 July 2015 5:41 AM IST
X
Pragnadhar Reddy Updated On: 1 July 2015 5:51 AM IST
ఓటుకు కోట్లు ఉదంతంలో తెలంగాణ ఏసీబీ ఎందుకు నిదానించింది? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేయదగినన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్న తెలంగాణ మంత్రులు ఎవరూ ఎందుకు మాట్లాడడం లేదు? ట‌్యాపింగ్‌కు సంబంధించి తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలలో కొంతయినా నిజముండే అవకాశాలున్నాయని, అవి బైటపడితే మొదటికే మోసం వస్తుందని తెలుసుకుని ఓటుకు కోట్లు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేయడం లేదని అధికారవర్గాలలో వినిపిస్తున్నది. తెలంగాణ హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిని రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా మార్చడానికి ట్యాపింగ్ వ్యవహారాలే కారణమని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు. మంగళవారంనాడు హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా రాజీవ్ త్రివేదిని కేసీఆర్ నియమించారు. అంతేకాదు తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా దీర్ఘకాలిక సెలవులో వెళ్లిపోయారు. ఈ పరిణామాలకు కారణం ట్యాపింగ్ భయమేనని వినిపిస్తోంది. ఓటుకు కోట్లు వ్యవహారంలో ఇంకా ముందుకు వెళ్తే అన్ని ఆధారాలను బైటపెట్టాల్సి వస్తుందని, అపుడు ట్యాపింగ్ విషయం కూడా బైటకు వస్తుందని అంటున్నారు. అందువల్లే తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యవహారంలో తీవ్రతను తగ్గించింది. ఆ కారణంగానే రేవంత్‌రెడ్డికి బెయిల్ కూడా వచ్చేసింది.
కేసీఆర్ సాధించిన విజయం తక్కువేమీ కాదు….
అయితే కేసీఆర్ ఇప్పటికే సాధించాల్సినంత విజయం సాధించేశారు. ఓటుకు కోట్లు వ్యవహారాన్ని జాతీయ స్థాయిలో రచ్చ చేసి కావల్సినంత మైలేజీ కొట్టేశారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాల గురించి దేశమంతా మాట్లాడుకునేలా చేశారు. ఇక ఈ ఉదంతంలో కేసును ముందుకు నడిపినా ఎవరికీ శిక్షలు పడే అవకాశాలు లేవు. ఎందుకంటే అన్ని వ్యవస్థలనూ మేనేజ్ చేయగలిగిన మొనగాడిగా చంద్రబాబుకు చాలా పేరుంది. అందువల్ల సాధించిన విజయంతో సంతృప్తి పడితే మేలని కేసీఆర్ భావించినట్లు కనిపిస్తోంది.
Next Story