ప్రొ.సాయిబాబాకు తాత్కాలిక బెయిల్
ఏడాది కాలంగా నాగ్‌పూర్ జైలులో మగ్గుతున్నఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు ముంబై హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నిషిద్ద మావోయిస్ట్ పార్టీతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై గత ఏడాది ఢిల్లీలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన నాగ్‌పూర్ జైల్లోనే ఉన్నారు. పోలియో బారిన పడి ప్రొ.సాయిబాబా రెండు కాళ్లూ చచ్చుబడి వీల్ చెయిర్ కు మాత్రమే పరిమితమయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని, వెంటనే సరైన వైద్యం అందించక పోతే ప్రాణాలకే ప్రమాదమని […]
ఏడాది కాలంగా నాగ్‌పూర్ జైలులో మగ్గుతున్నఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు ముంబై హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నిషిద్ద మావోయిస్ట్ పార్టీతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై గత ఏడాది ఢిల్లీలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన నాగ్‌పూర్ జైల్లోనే ఉన్నారు. పోలియో బారిన పడి ప్రొ.సాయిబాబా రెండు కాళ్లూ చచ్చుబడి వీల్ చెయిర్ కు మాత్రమే పరిమితమయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని, వెంటనే సరైన వైద్యం అందించక పోతే ప్రాణాలకే ప్రమాదమని వెలువడిన వార్తాకథనంతో పాటు, సామాజిక కార్యకర్త పూర్ణిమా ఉపాధ్యాయ్ రాసిన లేఖను బాంబే హైకోర్టు సుమోటో విచారణకు స్వీకరించింది. సాయిబాబా అనారోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రాథమిక హక్కులకుకు భంగం కలిగించకుండా ఉండేందుకు మూడు నెలల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి మోహిత్‌షాతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. రూ. 50,000 పూచీకత్తుపై సాయిబాబాను విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది.