త్వరలో టీఆర్ఎస్ గూటికి డి.శ్రీనివాస్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పిసిసి మాజీ అధ్యక్షులు డి.శ్రీనివాస్ టిఆర్‌ఎస్ పార్టీలో చేరబోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో తన పొజిషన్ పట్ల కొన్నాళ్లుగా ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అధిష్టానంపైన ముఖ్యంగా దిగ్విజయ్‌సింగ్‌పైన ఆయన ఆగ్రహంతో ఉన్నారు. త్వరలో ఆయన టీఆర్ ఎస్ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్ తీర్ధం పుచ్చుకొంటారని సమాచారం. టిఆర్‌ఎస్ ముఖ్యనేత, ఎంపీ కె.కేశవరావుతో డీఎస్ రహస్యంగా భేటీ అయ్యారని, టిఆర్‌ఎస్ పార్టీలో తన స్థానం, ఇతర రాజకీయ అంశాలపై […]
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పిసిసి మాజీ అధ్యక్షులు డి.శ్రీనివాస్ టిఆర్‌ఎస్ పార్టీలో చేరబోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో తన పొజిషన్ పట్ల కొన్నాళ్లుగా ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అధిష్టానంపైన ముఖ్యంగా దిగ్విజయ్‌సింగ్‌పైన ఆయన ఆగ్రహంతో ఉన్నారు. త్వరలో ఆయన టీఆర్ ఎస్ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్ తీర్ధం పుచ్చుకొంటారని సమాచారం. టిఆర్‌ఎస్ ముఖ్యనేత, ఎంపీ కె.కేశవరావుతో డీఎస్ రహస్యంగా భేటీ అయ్యారని, టిఆర్‌ఎస్ పార్టీలో తన స్థానం, ఇతర రాజకీయ అంశాలపై చర్చించారని సమాచారం. కెసిఆర్‌తో సమావేశమైన తర్వాత తన రాజకీయ భవిష్యత్తుపై డిఎస్ నిర్ణయం వెల్లడిస్తారని ఆయన సన్నిహితులంటున్నారు. కేకేతో సమావేశమైన విషయం తెలిసిన వెంటనే టి.పిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిఎస్‌ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆయనకు సన్నిహితంగా ఉండే నేతలతో మాట్లాడించే ప్రయత్నం చేసినా డిఎస్ అందుబాటులోకి రాలేదని తెలిసింది. తెలంగాణలో బిసి సామాజిక వర్గానికి చెందిన డిఎస్‌కు ఎమ్మెల్సీ అవకాశం వచ్చినట్లే వచ్చి చివరి క్షణంలో జారి పోయింది. రెండో సారి మండలికి అవకాశం ఇస్తామని డిఎస్‌కు హామీ ఇచ్చిన కాంగ్రెస్ హై కమాండ్ మాట తప్పింది. తనను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారని గ్రహించిన డిఎస్ కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజరు సింగ్ కారణంగానే మండలి పదవి రాలేదని డీఎస్ ఆగ్రహంతో ఉన్నారు. తనకు పార్టీలో చెక్ పేట్టేందుకే తన సొంత జిల్లా నిజామాబాద్‌కు చెందిన మహిళా నేత ఆకుల లలితకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారని డీఎస్ భావిస్తున్నారు. డిఎస్ విషయంలో కెసిఆర్ తో సంప్రదించిన కేకే పార్టీలో చేరేందుకు డీఎస్‌కు గ్రీన్ సిగల్ ఇచ్చారని కూడా వినిపిస్తోంది. తాను పార్టీని వీడాలనకుంటున్న విషయాన్నివివరిస్తూ డీఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసారని కూడా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పార్టీ జనరల్ సెక్రటరీ దిగ్విజరు సింగ్ తనకు చేసిన అన్యాయాన్ని డీఎస్ ఆ లేఖలో వివరించారట. దానిపై సోనియా ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. సోనియా పురమాయించిన మీదటే ఉత్తమ్ డీఎస్‌తో సంప్రదించారని, ఇక ఆయన వెనక్కి తగ్గే అవకాశాలు లేవని సన్నిహితులంటున్నారు.