మరో వివాదంలో రాజస్థాన్ సీఎం వసుంధర రాజే
ప్రభుత్వ సంపదైన ధోల్‌పూర్ ప్యాలెస్‌ను వసుంధర కుటుంబం తమ ఆస్తిగా బదలాయించుకుందని కాంగ్రెస్ నేతలు ఆరోపించడంతో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ మేరకు దానికి సంబంధించిన 1949 నాటి పత్రాలను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ మంగళవారం మీడియా ఎదుట బహిర్గతం చేశారు. రాజస్థాన్ ప్రజల ఆస్తి ఆయిన ధోల్‌పూర్ ప్యాలెస్‌ను వసుంధర రాజే కుమారుడు దుష్యంత్ సింగ్, ఆమె భర్త హేమంత్ సింగ్ తమ ఆస్తిగా బదలాయించుకున్నారని జైరామ్ […]
BY admin30 Jun 2015 1:07 PM GMT
admin Updated On: 30 Jun 2015 12:09 PM GMT
ప్రభుత్వ సంపదైన ధోల్‌పూర్ ప్యాలెస్‌ను వసుంధర కుటుంబం తమ ఆస్తిగా బదలాయించుకుందని కాంగ్రెస్ నేతలు ఆరోపించడంతో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ మేరకు దానికి సంబంధించిన 1949 నాటి పత్రాలను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ మంగళవారం మీడియా ఎదుట బహిర్గతం చేశారు. రాజస్థాన్ ప్రజల ఆస్తి ఆయిన ధోల్‌పూర్ ప్యాలెస్‌ను వసుంధర రాజే కుమారుడు దుష్యంత్ సింగ్, ఆమె భర్త హేమంత్ సింగ్ తమ ఆస్తిగా బదలాయించుకున్నారని జైరామ్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Next Story