డిజిటల్ ఇండియాతోనే భారత్‌కు నవశకం: ప‌్రధాని పిలుపు
డిజిటల్ ఇండియాను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డిజిటల్ ఇండియా పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. భారత్ నెట్, డిజిటల్ లాకర్, ఉపకార వేతనాల పోర్టల్ ను కూడా ఆయన బుధవారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ డిజిటల్ ఇండియాలో ఉన్నచోట నుంచే అన్ని సౌకర్యాలు పొందే అవకాశం ఉంటుందని, ప్రజా సేవల రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని ఆయన అన్నారు. ఈ పథకానికి సంబంధించి రవిశంకర్ ప్రసాద్‌ని అభినందిస్తున్నానని ప్రధాని […]
BY sarvi1 July 2015 12:58 PM IST
X
sarvi Updated On: 1 July 2015 12:58 PM IST
డిజిటల్ ఇండియాను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డిజిటల్ ఇండియా పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. భారత్ నెట్, డిజిటల్ లాకర్, ఉపకార వేతనాల పోర్టల్ ను కూడా ఆయన బుధవారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ డిజిటల్ ఇండియాలో ఉన్నచోట నుంచే అన్ని సౌకర్యాలు పొందే అవకాశం ఉంటుందని, ప్రజా సేవల రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని ఆయన అన్నారు. ఈ పథకానికి సంబంధించి రవిశంకర్ ప్రసాద్‌ని అభినందిస్తున్నానని ప్రధాని అన్నారు. ఈరోజు మనం ముందడుగు వేయకపోతే ప్రపంచం ముందుకెళ్ళిపోతుందని, మనం వెనుకబడి పోతామని ఆయన అన్నారు. ఇపుడు కమ్యూనికేషన్ ఎక్కడ బాగుంటే అక్కడ నగరాలు ఏర్పడుతున్నాయని, ఒకప్పుడు జనం నదీ, సముద్ర తీరాల్లో నివశించేవారు. ఇపుడు సమాచారం ఎక్కడుంటే అక్కడే నివశిస్తున్నారు. దీన్ని గుర్తించే మనం ముందుకెళ్ళాలి అని ఆయన అన్నారు. ఇపుడు మనం సమన్వయం చేసుకోకపోతే పల్లెలు, పట్టణాల మధ్య తీవ్ర అంతరం ఏర్పడుతుందని ఆయన హెచ్చరించారు. మినిమమ్ గవర్నమెంట్, మేగ్జిమం గవర్నెన్స్ కోసమే డిజిటల్ ఇండియా పథకం అని ప్రధాని స్పష్టం చేశారు. డిజిటల్ ఇండియా చిన్న పరికరం… ఇది పుస్తకాల్లేని చదువుని అందిస్తుంది… బరువులు లేని పరిజ్ఞానం చేతికి ఇస్తుందని ఆయన అన్నారు. ఇపుడు మనం స్వతంత్రులం… ప్రపంచం కన్నా ఒక్క అడుగు మనం ముందుంటేనే మనకు గౌరవం దక్కుతుందని ప్రధాని స్పష్టం చేశారు. ప్రజల కలలను సాకారం చేయడంలో డిజిటల్ ఇండియా ముందడుగని ప్రధాని అన్నారు. ఇంతకుముందు పిల్లలు పెద్దల నుంచి కళ్ళద్దాలు లాక్కునేవారు. ఇపుడు కంప్యూటర్లు, ల్యాప్ టాప్‌లు లాక్కుంటున్నారు. డిజిటల్ యుగానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. ఈ-గవర్నెన్స్, ఈజీ-గవర్నెన్స్‌కు ఈ పథకం ఊతమిస్తుందని ప్రధాని చెప్పారు. ఓ చిన్న పరికరం రైతుకు భరోసా ఇచ్చేలా పని చేస్తుంది. వాతావరణ పరిస్థితుల్ని తెలియజేస్తుందని ఇది మన శాస్త్రవేత్తలు సాధించిన విజయం కాదా అని ప్రశ్నించారు. మన మేథో సంపత్తిని ఇతరులకు ఎందుకు పంచి పెడుతున్నాం అని ప్రశ్నించారు. యువతకు అవసరమైన మద్దతు ప్రభుత్వం అందిస్తుందని, మన వనరులను మనమే ఉపయోగించుకుని దేశాన్ని సుసంపన్నం చేయాలని ప్రధానమంత్రి పిలుపు ఇచ్చారు. డిజిటల్ ఇండియా పథకంతో అవినీతి నిర్మూలన సైతం సాధ్యమేనని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు. దేశంలో 975 మిలియన్ల మొబైల్ వినియోగదారులున్నారని, వీటి సాయంతో ఎన్నో పనులు చేయవచ్చని ఆయన అన్నారు.
Next Story