తాడేపల్లి గూడెంలోనే నిట్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)ను పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. ఇటీవల నిట్‌ను ఏలూరు – విజయవాడ మధ్యలో ఏర్పాటు చేసేందుకు దాదాపుగా ఖరారైంది. అయితే, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మంత్రి మాణిక్యాలరావు నిట్‌ను తమ జిల్లాలో ఏర్పాటు చేయాల్సిందిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిని, కేంద్రమంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని […]
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)ను పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. ఇటీవల నిట్‌ను ఏలూరు – విజయవాడ మధ్యలో ఏర్పాటు చేసేందుకు దాదాపుగా ఖరారైంది. అయితే, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మంత్రి మాణిక్యాలరావు నిట్‌ను తమ జిల్లాలో ఏర్పాటు చేయాల్సిందిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిని, కేంద్రమంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నిట్‌ను తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేయమని ఆయన కోరారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిట్‌ను తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసేందుకు అంగీకరించి అదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.