Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 130

డాక్టర్‌  పేషెంట్‌ని చూసి “నా దగ్గరికి రాకముందు వేరే డాక్టర్‌ని ఎవర్నయినా కలిశావా?” పేషెంట్‌: లేదు డాక్టర్‌! మెడికల్‌ షాపతన్ని కలిశాను డాక్టర్‌: ఆ బుర్రలేని వాడేమన్నాడు? పేషెంట్‌: మిమ్మల్ని కలవమన్నారండీ! ——————————————————————————– ఒక ముసలావిడ పార్కుకు వచ్చింది. సునీత కూర్చుని ఉంటే పక్కనే ఒక కుక్క తోక కదిలిస్తూ నిల్చుంది. ముసలావిడ వచ్చి సునీత పక్కనే కూర్చుంటూ కుక్కను చూసి “మీ కుక్క కరుస్తుందా?” అని అడిగింది. సునీత “కరవదు” అంది. పక్కనే వున్న కుక్కను […]

డాక్టర్‌ పేషెంట్‌ని చూసి “నా దగ్గరికి రాకముందు వేరే డాక్టర్‌ని ఎవర్నయినా కలిశావా?”
పేషెంట్‌: లేదు డాక్టర్‌! మెడికల్‌ షాపతన్ని కలిశాను
డాక్టర్‌: ఆ బుర్రలేని వాడేమన్నాడు?
పేషెంట్‌: మిమ్మల్ని కలవమన్నారండీ!
——————————————————————————–
ఒక ముసలావిడ పార్కుకు వచ్చింది.
సునీత కూర్చుని ఉంటే పక్కనే ఒక కుక్క తోక కదిలిస్తూ నిల్చుంది. ముసలావిడ వచ్చి సునీత పక్కనే కూర్చుంటూ కుక్కను చూసి “మీ కుక్క కరుస్తుందా?” అని అడిగింది.
సునీత “కరవదు” అంది.
పక్కనే వున్న కుక్కను ముసలావిడ తల నిమరడానికి ప్రయత్నిస్తే ముసలావిడ వేలిని ఆ కుక్క కరిచింది. ముసలావిడ కుయ్యో మొర్రో అంటూ “మీ కుక్క కరవదని చెప్పావే” అంది సునీతతో.
సునీత “అవును. మా కుక్క కరవదని చెప్పినమాట నిజమే” అంది.
“మరి కరిచిందే” అంది ముసలావిడ.
“అది మా కుక్క కాదు” అంది సునీత.
——————————————————————————–
ఒక రైతు తన గుర్రాన్ని కట్టేసే దగ్గర ఒక నోటీసు అంటించాడు
“దయచేసి గుర్రానికి బన్నులు, కేకులు పెట్టకండి”

కొంతసేపటికి దానికింద ఇంకో నోటీసు కనిపించింది.
“పైన ఉన్న నోటీసును పట్టించుకోకండి” – గుర్రం

First Published:  30 Jun 2015 6:33 PM IST
Next Story