అరకు ఎంపీపై సీబీఐ చార్జిషీటు
అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై సీబీఐ అధికారులు చార్జిషీటు దాఖలు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.42 కోట్ల మేర మోసం చేసినట్లు చార్జిషీటులో పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ర్టక్చర్‌కు చెందిన నాటి మేనేజింగ్ డైరెక్టర్ , తన భర్త అయిన పి. రామకోటేశ్వర రావుతో కలిసి ఈ మోసానికి పాల్పడినట్లు చార్జిషీటులో పొందుపరిచారు. వీరు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రూ.25కోట్ల రుణం తీసుకున్నారని, దానివల్ల బ్యాంకుకు దాదాపు రూ.42కోట్ల నష్టం వాటిల్లిందన్నది అభియోగం. బ్యాంకు […]
BY Pragnadhar Reddy1 July 2015 2:23 AM IST
X
Pragnadhar Reddy Updated On: 1 July 2015 2:23 AM IST
అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై సీబీఐ అధికారులు చార్జిషీటు దాఖలు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.42 కోట్ల మేర మోసం చేసినట్లు చార్జిషీటులో పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ర్టక్చర్‌కు చెందిన నాటి మేనేజింగ్ డైరెక్టర్ , తన భర్త అయిన పి. రామకోటేశ్వర రావుతో కలిసి ఈ మోసానికి పాల్పడినట్లు చార్జిషీటులో పొందుపరిచారు. వీరు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రూ.25కోట్ల రుణం తీసుకున్నారని, దానివల్ల బ్యాంకుకు దాదాపు రూ.42కోట్ల నష్టం వాటిల్లిందన్నది అభియోగం. బ్యాంకు అధికారులు కేకే అరవిందక్షణ్ (పంజాబ్ నేషనల్ బ్యాంకు హెడ్ ఆఫీస్ జనరల్ మేనేజర్), బీకే జయప్రకాశం (అప్పటి అసిస్టెంట్ జనరల్ మేనేజర్) నిందితులతో కుమ్మక్కయ్యి మొత్తం వ్యవహారాన్నినడిపించారని చార్జిషీటులో పేర్కొన్నారు. నిందితులపై సెక్షన్ 120 బీ (నేరపూరితకుట్ర), రెడ్‌విత్ 420 (చీటింగ్), 468 (ఫోర్జరీ), ఐపీసీ 471కింద, పీసీ యాక్ట్ 1988లోని సెక్షన్ 13(2) రెడ్‌విత్ 13(1) (డీ) అభియోగాలు నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది.
గతంలోనూ ఆరోపణలు..
గీతపై ఆరోపణలు ఇదే మొదటిసారి కాదు. గతంలో అనంతపురం ఆర్‌డీఓగా పనిచేసిన సమయంలో రూ.40 లక్షల ప్రభుత్వ సొమ్మును స్వాహా చేసిన కేసులో ఉద్యోగం నుంచి తొలగింపునకు గురైన కేసును కూడా ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. 2003-04లో గీత అనంతపురం ఆర్‌డీఓగా పనిచేశారు. అప్పుడు ప్రభుత్వానికి చెందిన రూ.40 లక్షల సొమ్మును అక్రమపద్ధతిలో తన భర్త ఖాతాకు మళ్లించారని ఆరోపణలు రావడంతో ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది.
Next Story