Telugu Global
Others

బ‌రువు త‌గ్గించే బాదం 

అధిక బ‌రువు, ఊబ‌కాయంతో బాధ ప‌డేవారు త‌మ ఆహారంలో బాదంను చేర్చుకోవ‌డం వ‌ల్ల‌ శ‌రీర బ‌రువు ఆరోగ్య‌క‌ర స్థాయికి చేరుకుంటుంద‌ని నిపుణులు సూచిస్తున్నారు. బాదం ప‌ప్పులో అధిక స్థాయిలో పోష‌కాలు, త‌క్కువ స్థాయిలో సాచురేటేడ్ కొవ్వు ప‌దార్ధాలు క‌లిగి ఉంటాయి. స‌రైన ఆహార ప్ర‌ణాళిక‌తోపాటు తేలికపాటి వ్యాయామాల‌ను చేస్తూ బాదంల‌ను తినుట వ‌ల‌న బ‌రువు త‌గ్గ వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.   అంతేకాదు మ‌ధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, ఇత‌ర అనారోగ్యాల‌కు గుర‌వ‌కుండా బాదంలు స‌హాయ ప‌డ‌తాయ‌ని […]

బ‌రువు త‌గ్గించే బాదం 
X
అధిక బ‌రువు, ఊబ‌కాయంతో బాధ ప‌డేవారు త‌మ ఆహారంలో బాదంను చేర్చుకోవ‌డం వ‌ల్ల‌ శ‌రీర బ‌రువు ఆరోగ్య‌క‌ర స్థాయికి చేరుకుంటుంద‌ని నిపుణులు సూచిస్తున్నారు. బాదం ప‌ప్పులో అధిక స్థాయిలో పోష‌కాలు, త‌క్కువ స్థాయిలో సాచురేటేడ్ కొవ్వు ప‌దార్ధాలు క‌లిగి ఉంటాయి. స‌రైన ఆహార ప్ర‌ణాళిక‌తోపాటు తేలికపాటి వ్యాయామాల‌ను చేస్తూ బాదంల‌ను తినుట వ‌ల‌న బ‌రువు త‌గ్గ వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు మ‌ధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, ఇత‌ర అనారోగ్యాల‌కు గుర‌వ‌కుండా బాదంలు స‌హాయ ప‌డ‌తాయ‌ని ఇంట‌ర్నేష‌న‌ల్ జ‌ర్న‌ల్స్ ఆప్ ఒబేసిటీ అండ్ రిలేటెడ్ మెట‌బోలిక్ డిజార్డ‌ర్స్ స్టేటెడ్ ప్ర‌క‌టించింది. అధిక బ‌రువున్న వారు ఆహారంలో బాదంల‌ను క‌లుపుకోవ‌డం వ‌ల‌న 65 శాతం మంది కేవ‌లం ఆరు నెల‌ల్లోనే బ‌రువు త‌గ్గార‌ని ఆ జ‌ర్న‌ల్ ప్ర‌క‌టించింది.
క్యాలోరీలు మ‌రియు పోష‌క విలువ‌లు
బాదంలు అధిక మొత్తంలో పోష‌క విలువ‌ల‌ను క‌లిగి ఉంటాయి. క‌నుక ప్ర‌తిరోజూ బాదం ప‌ప్పుల‌ను తిన‌డం చాలా అవ‌స‌రం. 820 క్యాలరీల‌ను క‌లిగి ఉన్న బాదం ప‌ప్పుల‌ను పొడిగా లేదా కాల్చుకుని కూడా తిన‌వ‌చ్చు. ఇందులో రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టంగా ఉంచే విట‌మిన్-ఇ కూడా పుష్క‌లంగా ల‌భిస్తుంది.
బ‌రువు త‌గ్గాలంటే త‌గిన స్థాయిలోనే
శ‌రీర బ‌రువును త‌గ్గించుకోవాల‌నుకున్న‌వారు బాదంను త‌గిన స్థాయిలోనే తినాలి. బాదంప‌ప్పులో అసంఖ్యాక‌మైన పోష‌క విలువ‌లున్న‌ప్ప‌టికీ అధిక మొత్తంలో తీసుకోవ‌డం వ‌ల‌న క్యాలరీల సంఖ్య కూడా అధిక‌మ‌వుతుంది. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగు ప‌రిచినా, బ‌రువు త‌గ్గించ‌వు. అందువ‌ల్ల వీటిని త‌క్కువ మోతాదులోనే తీసుకోవాలి. దీంతో శ‌రీర బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతుంది.
ఇతర లాభాలు
బాదంలు బ‌రువు త‌గ్గించ‌డ‌మే కాకుండా, శ‌రీరంలోని చెడు కొవ్వు ప‌దార్దాల స్థాయిని త‌గ్గించి, మంచి కొవ్వు ప‌దార్థాల స్థాయిని పెంచుతాయి. దీంతో గుండె సంబంధిత వ్యాధులు త‌గ్గుతాయి. రెడ్‌మీట్, వేయించిన ఆహార ప‌దార్ధాల వంటి అధిక మొత్తంలో ప్రోటీన్‌ల‌ను అందించే వాటికి బ‌దులుగా బాదంల‌ను తీసుకోవాలి. ఇవి శ‌రీరంలోని ప్రీ రాడిక‌ల్‌ను తొల‌గించే యాంటీ ఆక్సిడెంట్ల‌ను పుష్క‌లంగా క‌లిగి ఉంటాయి. కాల్షియం, ఫోలేట్ వంటి ముఖ్య పోష‌కాలు కూడా బాదంలో అధికంగా ఉన్నాయి.
First Published:  30 Jun 2015 8:01 PM GMT
Next Story