అన్నదాతలకు అప్పుపుట్టడంలేదు
అన్నదాతలకు రుణాలు ఇచ్చేవిధంగా బ్యాంకులను ఆదేశించాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖరీఫ్ ప్రారంభమై నెలరోజులైనా బ్యాంకుల నుండి రుణాలు అందకపోవడంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఖరీఫ్ పంటలకు రూ.15.087 కోట్లు, రబీకి రూ.8.122 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారని, కానీ నేటికీ రుణాలు మంజూరు చేసిన దాఖలాలు లేవన్నారు. రుణమాఫీ […]
BY Pragnadhar Reddy30 Jun 2015 2:49 AM IST
X
Pragnadhar Reddy Updated On: 30 Jun 2015 5:42 AM IST
అన్నదాతలకు రుణాలు ఇచ్చేవిధంగా బ్యాంకులను ఆదేశించాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖరీఫ్ ప్రారంభమై నెలరోజులైనా బ్యాంకుల నుండి రుణాలు అందకపోవడంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఖరీఫ్ పంటలకు రూ.15.087 కోట్లు, రబీకి రూ.8.122 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారని, కానీ నేటికీ రుణాలు మంజూరు చేసిన దాఖలాలు లేవన్నారు. రుణమాఫీ ప్రకటించినా ఆ మొత్తాన్ని సంపూర్ణంగా బ్యాంకులకు చెల్లించకపోవడంతో రైతులు బాకీదారులుగానే ఉన్నారన్నారు. గతేడాది రుణమాఫీ పథకం కింద రూ.4250 కోట్లు బ్యాంకులకు చెల్లించడంతో అంతేమొత్తాన్ని రుణాలుగా ఇచ్చాయన్నారు. అదేవిధంగా గతేడాది రుణప్రణాళికలో ప్రకటించిన రూ.18,718 కోట్లు పంపిణీ కాలేదని వివరించారు. మాఫీ పథకాన్ని అపహాస్యం చేస్తూ రెన్యూవల్ చేసిన మొత్తాలనే పంట రుణాలుగా ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించుకుందని విమర్శించారు. తిరిగి ఈ ఏడాది ఇప్పటివరకు రెండో విడత మాఫీ నిధులు బ్యాంకులకు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడానికి ముందుకురావడంలేదని వివరించారు. ఇప్పటికైనా రైతులను రుణ విముక్తులను చేయాలని, బ్యాంకుల నుండి పంట రుణాలు ఇప్పించాలని తమ్మినేని కోరారు.
Next Story