జర నవ్వండి ప్లీజ్ 129
ఒక వ్యక్తి కళ్ళ డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు. టెస్టులు చేశాక కింద కూర్చోమని చెప్పి డాక్టర్ ఒక టెస్ట్ కార్డు చూపించి “ఇవి చదవగలవా?” అన్నాడు. “చదవలేను” అన్నాడా వ్యక్తి. డాక్టర్ ఆ కార్డును మరింత కళ్ళ దగ్గరగా పెట్టి “ఇప్పుడు?” అన్నాడు. ఆ వ్యక్తి “చదవలేను” అన్నాడు. డాక్టర్ దాదాపు కళ్ళకు తగిలేట్లు పెట్టి “ఇప్పుడు?” అన్నాడు. “చదవలేను సార్. నాకు చదవడం రాదు” అన్నాడు. ———————— “నేను తాగుడు మానడానికి డాక్టర్ నాకేమైనా సహాయ […]
ఒక వ్యక్తి కళ్ళ డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు. టెస్టులు చేశాక కింద కూర్చోమని చెప్పి డాక్టర్ ఒక టెస్ట్ కార్డు చూపించి
“ఇవి చదవగలవా?” అన్నాడు.
“చదవలేను” అన్నాడా వ్యక్తి.
డాక్టర్ ఆ కార్డును మరింత కళ్ళ దగ్గరగా పెట్టి “ఇప్పుడు?” అన్నాడు.
ఆ వ్యక్తి “చదవలేను” అన్నాడు.
డాక్టర్ దాదాపు కళ్ళకు తగిలేట్లు పెట్టి “ఇప్పుడు?” అన్నాడు.
“చదవలేను సార్. నాకు చదవడం రాదు” అన్నాడు.
————————
“నేను తాగుడు మానడానికి డాక్టర్ నాకేమైనా సహాయ పడగలడా అని డాక్టర్ దగ్గరికెళ్ళాను”
“ఏమైనా సహాయ పడ్డాడా?”
“ఆ! నేను మానేశాను. ఇప్పుడు డాక్టర్ తాగుతున్నాడు”.
—————-
కారు సర్వీస్ సెంటరతను డాక్టర్ కారు చెకప్ చేసి ఏ సమస్యాలేదని 200 బిల్లు వేశాడు. డాక్టర్ “ఏ ప్రాబ్లం లేదన్నావు. మరి రెండువందల బిల్లు ఎందుకు వేశావు?” అన్నాడు.
సర్వీస్ సెంటరతను “డాక్టర్! గత వారం నేను మీ దగ్గరికొస్తే మీరు చెకప్ చేసి ఏ ప్రాబ్లమూ లేదని చెప్పి 200 బిల్లు వెయ్యలేదా” అన్నాడు.