Telugu Global
NEWS

తిరుప‌తిలో సండ్ర‌?

మ‌రో నోటీసుకు ఏసీబీ రెడీ. గ‌డువులోగా హాజ‌రు కాక‌పోతే అరెస్టు వారెంట్‌. టీడీపీ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఎక్క‌డ ఉన్నారు? ఏం చేస్తున్నారు? గ‌డువు ముగిసినా ఎందుకు హాజ‌రు కావ‌డం లేదు? ఓటుకు కోట్లు కేసులో విచారణకు హాజరుకావాలని గత నెల 16న సీఆర్పీసీ ప్రకారం నోటీసులు జారీచేసినా సండ్ర ఇంతవరకూ ఏసీబీ ఎదుటకు రాలేదు.  సండ్ర ప్రస్తుతం తిరుపతిలో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయ‌న‌ టీటీడీ బోర్డు సభ్యుడిగా కూడా ఉండటంవల్ల తిరుప‌తి కొంత సేఫ్ […]

తిరుప‌తిలో సండ్ర‌?
X
మ‌రో నోటీసుకు ఏసీబీ రెడీ. గ‌డువులోగా హాజ‌రు కాక‌పోతే అరెస్టు వారెంట్‌. టీడీపీ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఎక్క‌డ ఉన్నారు? ఏం చేస్తున్నారు? గ‌డువు ముగిసినా ఎందుకు హాజ‌రు కావ‌డం లేదు? ఓటుకు కోట్లు కేసులో విచారణకు హాజరుకావాలని గత నెల 16న సీఆర్పీసీ ప్రకారం నోటీసులు జారీచేసినా సండ్ర ఇంతవరకూ ఏసీబీ ఎదుటకు రాలేదు. సండ్ర ప్రస్తుతం తిరుపతిలో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయ‌న‌ టీటీడీ బోర్డు సభ్యుడిగా కూడా ఉండటంవల్ల తిరుప‌తి కొంత సేఫ్ ప్లేస్ అని భావించి అక్కడే ఉన్నట్లు భావిస్తున్నారు. అనారోగ్యం పేరుతో పదిరోజులు గడువు కోరి.. అజ్ఞాతంలోకి వెళ్లిన సండ్ర.. గడువు ముగిసినప్పటికీ హాజరుకాకపోవడాన్ని ఏసీబీ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. ఆయన ఫోన్లు కూడా స్విచ్చాఫ్ అని వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాయంత్రానికల్లా తమ ఎదుట హాజరవ్వాల్సిందిగా మంగళవారం మరో నోటీసు జారీచేసే అవకాశం ఉన్నట్లు ఏసీబీ అధికారులద్వారా తెలుస్తున్నది. ఈ నోటీసుకు స్పందించకపోతే మరింత తీవ్రంగా పరిగణించి, కోర్టుద్వారా అరెస్ట్ వారెంట్ జారీచేయించేందుకు రంగం సిద్ధంచేసినట్టు స‌మాచారం. సండ్ర ఎక్కడున్నా అరెస్ట్ వారెంట్‌తో వెళ్లి అదుపులోకి తీసుకుంటామని ఏసీబీ ఉన్నతాధికారులు అంటున్నారు. అనారోగ్యమే కారణమైతే అజ్ఞాతంలో ఉండాల్సిన అవసరమేంటని ఏసీబీ అధికారులు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. కేసులో తన పాత్రేమీ లేకపోతే పది రోజుల నుంచి పక్క రాష్ట్రంలో తప్పించుకొని ఎందుకు తిరుగుతున్నారన్న విషయంలో సండ్రను విచారించాలని ఏసీబీ భావిస్తున్నది. కేసుకు ఎలాంటి సంబంధం లేకపోతే తెలిసిన విషయాలు చెప్పి వెళ్లిపోవాల్సి ఉండేది కానీ, ఇలా సందేహాత్మకంగా వ్యవహరించడం ద్వారా మరో కుట్రకు సండ్ర తెరదీసినట్టే భావించాల్సి ఉంటుందని ఏసీబీ పేర్కొంటున్నది.
First Published:  30 Jun 2015 2:46 AM IST
Next Story