Telugu Global
Others

సాయుధ బలగాలకూ యోగా అనివార్యం

భారత సాయుధ బలగాల్లోని పది లక్షల మంది సిబ్బందికి ఇక యోగా తప్పనిసరి చేస్తూ కేంద్ర హొంశాఖ ఆదేశాలు జారీ చేసింది. రోజువారీ చేసే డ్రిల్‌లో ఈ యోగాను కూడా చేర్చాల‌ని నిర్దేశించింది. ఈ మేరకు కేంద్రం పారామిలటరీ బలగాలకు ఆదేశాలిచ్చింది. సరిహద్దు భద్రతా దళాలతో పాటు, వామపక్ష తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాల్లోని సాయుధ దళాలు నిత్యం యోగా సాధన చేయాల్సిందేనని సూచించింది. యోగా నిర్వ‌హ‌ణ‌కు ఏమేం చ‌ర్య‌లు చేప‌ట్టారో త‌మ‌కు తెలియ‌జేయాల‌ని కూడా హోంశాఖ త‌మ […]

భారత సాయుధ బలగాల్లోని పది లక్షల మంది సిబ్బందికి ఇక యోగా తప్పనిసరి చేస్తూ కేంద్ర హొంశాఖ ఆదేశాలు జారీ చేసింది. రోజువారీ చేసే డ్రిల్‌లో ఈ యోగాను కూడా చేర్చాల‌ని నిర్దేశించింది. ఈ మేరకు కేంద్రం పారామిలటరీ బలగాలకు ఆదేశాలిచ్చింది. సరిహద్దు భద్రతా దళాలతో పాటు, వామపక్ష తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాల్లోని సాయుధ దళాలు నిత్యం యోగా సాధన చేయాల్సిందేనని సూచించింది. యోగా నిర్వ‌హ‌ణ‌కు ఏమేం చ‌ర్య‌లు చేప‌ట్టారో త‌మ‌కు తెలియ‌జేయాల‌ని కూడా హోంశాఖ త‌మ ఆదేశాల్లో పేర్కొంది.
First Published:  29 Jun 2015 6:34 PM IST
Next Story