కరెంట్‌షాక్‌తో ఓ కుటుంబంలో ఐదుగురు దుర్మరణం
విజయవాడలోని భవానీపురం ఊర్మిళానగర్‌లో విషాదం అలముకుంది. కరెంట్ షాక్‌తో ఒకే కుటుంబంలోని ఐదుగురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంటి మరమ్మత్తులకు అందరూ కలిసి పని చేస్తుండగా ముందు ఒకరికి కరెంట్‌షాక్ కొట్టింది. ఒకరిని రక్షించబోయి మరొకరు ఇలా ఐదుగురు వరుసగా మృత్యువాత పడ్డారు. ఈ సంఘటనతో ఊర్మిళానగర్‌లో మృతుల బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఇంటి సిమెంటు రేకులు తొలగిస్తుండగా కరెంట్ షాక్‌తో ఈ ప్రమాదం చోటు చేసుకుందని బంధువులు, ప్రత్యక్షసాక్ష్యులు చెబుతున్నారు. ఇంటిపై ఉన్న రేకులు విద్యుత్ వైర్లకు […]
BY sarvi29 Jun 2015 1:06 PM GMT
sarvi Updated On: 30 Jun 2015 2:24 AM GMT
విజయవాడలోని భవానీపురం ఊర్మిళానగర్‌లో విషాదం అలముకుంది. కరెంట్ షాక్‌తో ఒకే కుటుంబంలోని ఐదుగురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంటి మరమ్మత్తులకు అందరూ కలిసి పని చేస్తుండగా ముందు ఒకరికి కరెంట్‌షాక్ కొట్టింది. ఒకరిని రక్షించబోయి మరొకరు ఇలా ఐదుగురు వరుసగా మృత్యువాత పడ్డారు. ఈ సంఘటనతో ఊర్మిళానగర్‌లో మృతుల బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఇంటి సిమెంటు రేకులు తొలగిస్తుండగా కరెంట్ షాక్‌తో ఈ ప్రమాదం చోటు చేసుకుందని బంధువులు, ప్రత్యక్షసాక్ష్యులు చెబుతున్నారు. ఇంటిపై ఉన్న రేకులు విద్యుత్ వైర్లకు దగ్గరలో ఉన్నాయి. రేకులు తీస్తుండగా అడ్డువచ్చిన తీగలను కదిపే యత్నంలో అవి తగిలి కరెంట్ షాక్ ఏర్పడింది. ప్రమాద స్థలాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శించారు. ఈ దుర్ఘటనపై సీఎం చంద్రబాబునాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
Next Story