కేరళ కాలేజీల్లో పొట్టిగౌన్లు నిషేధం
టైట్ జీన్స్, షార్ట్ టాప్స్, పొట్టి గౌనులు ధరించరాదంటూ ఉత్తర కేరళలోని ముస్లిం మహిళ విద్యాసంస్థ ఆదేశాలు జారీ చేసింది. కోజికోడ్‌లోని నడక్కవులో ఈ కళాశాల ఉంది. కొత్తగా కాలేజీలో చేరిన మొదటి సంవత్సరం విద్యార్థినిలకు ఈ నిషేధం వర్తిస్తుదని, జులై 8 నుంచి ప్రారంభమయ్యే క్లాసులకు వచ్చే విద్యార్థినులు ఈ ఆదేశాలు పాటించాలని యాజమాన్యం సూచించింది. సల్వార్, చూడీదార్‌తో పాటు ఓవర్ కోటు కలిగి ఉండేలా ఓ కొత్త పథకాన్ని త్వరలో ప్రారంభించబోతున్నట్టు కాలేజీ యాజమాన్యం […]
BY sarvi29 Jun 2015 1:12 PM GMT
sarvi Updated On: 30 Jun 2015 7:00 AM GMT
టైట్ జీన్స్, షార్ట్ టాప్స్, పొట్టి గౌనులు ధరించరాదంటూ ఉత్తర కేరళలోని ముస్లిం మహిళ విద్యాసంస్థ ఆదేశాలు జారీ చేసింది. కోజికోడ్‌లోని నడక్కవులో ఈ కళాశాల ఉంది. కొత్తగా కాలేజీలో చేరిన మొదటి సంవత్సరం విద్యార్థినిలకు ఈ నిషేధం వర్తిస్తుదని, జులై 8 నుంచి ప్రారంభమయ్యే క్లాసులకు వచ్చే విద్యార్థినులు ఈ ఆదేశాలు పాటించాలని యాజమాన్యం సూచించింది. సల్వార్, చూడీదార్‌తో పాటు ఓవర్ కోటు కలిగి ఉండేలా ఓ కొత్త పథకాన్ని త్వరలో ప్రారంభించబోతున్నట్టు కాలేజీ యాజమాన్యం ప్రకటించింది. మెడలో స్కార్ప్ వేసుకోవడానికి కూడా అనుమతించనున్నట్టు తెలిపింది. టైట్ జీన్స్, షార్ట్ టాప్స్, పొట్టి గౌన్లు వేసుకురావడం తాను గమనించానని, వీటిని ఇక అనుమతించే ప్రసక్తే లేదని కాలేజీ ప్రిన్సిపాల్ బి. సీతాలక్ష్మి చెప్పారు. ఈ డ్రెస్ కోడ్ కొత్తవారికి ఖచ్చితంగా అమలు చేస్తామని, పాత విద్యార్థులు మాత్రం ప్రకటిత డ్రెస్ కోడ్‌కు దగ్గరలో ఉండే విధంగా దుస్తులు ధరించాలని ఆమె సూచించారు. యూనిఫాం ప్రవేశపెట్టడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారని, తమ కాలేజీకి వచ్చే విద్యార్థినుల్లో 40 శాతం మంది పేద కుటుంబాల నుంచి వస్తున్నవారేనని ఆమె తెలిపారు.
Next Story