Telugu Global
Others

త‌ల‌సాని అన‌ర్హ‌త ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్న కాంగ్రెస్ 

తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్‌లోకి జంప్ అయిన ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ అన‌ర్హ‌త‌కు కాంగ్రెస్ పావులు క‌దుపుతోంది. తాను ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశాన‌ని చెబుతున్న త‌ల‌సాని ప్ర‌స్తుతం తెలంగాణ వాణిజ్య‌శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. అయితే ఇదెందుకు ఆమోదించ‌లేద‌న్న‌ది ఒక సందేహం కాగా అస‌లు ఎమ్మెల్యే ప‌ద‌వికి ఆయ‌న రాజీనామా చేశారా అనేది మ‌రో ప్ర‌ధాన సందేహం. మొత్తం మీద త‌ల‌సానిని అన‌ర్హుడిగా చేయ‌డానికి ఉన్న అవ‌కాశాల‌న్నింటిపై కాంగ్రెస్ ప్ర‌య‌త్నించ‌డంపైనే ఇప్పుడు చ‌ర్చ జ‌రుగుతోంది. […]

త‌ల‌సాని అన‌ర్హ‌త ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్న కాంగ్రెస్ 
X
తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్‌లోకి జంప్ అయిన ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ అన‌ర్హ‌త‌కు కాంగ్రెస్ పావులు క‌దుపుతోంది. తాను ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశాన‌ని చెబుతున్న త‌ల‌సాని ప్ర‌స్తుతం తెలంగాణ వాణిజ్య‌శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. అయితే ఇదెందుకు ఆమోదించ‌లేద‌న్న‌ది ఒక సందేహం కాగా అస‌లు ఎమ్మెల్యే ప‌ద‌వికి ఆయ‌న రాజీనామా చేశారా అనేది మ‌రో ప్ర‌ధాన సందేహం. మొత్తం మీద త‌ల‌సానిని అన‌ర్హుడిగా చేయ‌డానికి ఉన్న అవ‌కాశాల‌న్నింటిపై కాంగ్రెస్ ప్ర‌య‌త్నించ‌డంపైనే ఇప్పుడు చ‌ర్చ జ‌రుగుతోంది. మామూలుగా అయితే ఈ ప‌నిని తెలుగుదేశం పార్టీ చేయాలి. కాని అంత‌క‌న్నా ఎక్కువ ఆస‌క్తిని కాంగ్రెస్ పార్టీ క‌న‌బ‌రుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో 13మంది బీఎస్సీ ఎమ్మెల్యేలను కోర్టు అనర్హుడిగా ప్రకటించిన కేసు ఆధారంగా తలసానిని అనర్హుడిగా ప్రకటించాలంటూ కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఇక పార్టీ మాజీ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకట రమణారెడ్డి సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ)ను ఉపయోగించుకున్నారు. టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారంటూ బయట చెప్పారని, దీంతో ఆ రాజీనామా కాపీని ఇవ్వాలంటూ అసెంబ్లీ కార్యదర్శిని గండ్ర కోరారు. ఈ మేరకు ఆర్‌టీఐ చ‌ట్టం కింద ఆయన దరఖాస్తు చేశారు. రాజీనామా కాపీ లభిస్తే దానిపై ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచిస్తామని గండ్ర చెబుతున్నారు. రాజీనామా కాపీ ఇచ్చినట్లయితే ఎమ్మెల్యే కాని వ్యక్తి ఆరు నెలలు దాటినప్పటికీ మంత్రి పదవిలో ఎలా కొనసాగుతారంటూ ప్రశ్నించడానికి అవకాశముంటుందని తెలిపారు. ఒకవేళ అసెంబ్లీ కార్యదర్శి నుంచి రాజీనామా కాపీ రానిపక్షంలో రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్‌, జాతీయ సమాచార ప్రధాన కమిషనర్‌ దృష్టికి దీన్ని తీసుకెళతానని పేర్కొన్నారు. అంతేకాదు సమాచార కమిషనర్ల నుంచి వచ్చే సమాధానాల ఆధారంగా కోర్టుకు వెళ్లే విషయాన్నీ ఆలోచిస్తామని తెలిపారు.
తలసానిని బర్తరఫ్‌ చేయాలి: కాంగ్రెస్‌ నేత మర్రి
రాష్ట్ర వాణిజ్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి రాష్ట్ర గవర్నర్‌ను డిమాండ్‌ చేశారు. ఆయనకు చెల్లిస్తూ వచ్చిన వేతనం, ఇతర భత్యాలు, ప్రయోజనాల తాలూకు డబ్బును రికవరీ చేయాలని అన్నారు. సీఎల్పీ కార్యాలయం వద్ద ఆయన విలేకర్లతో మాట్లాడారు. టీడీపీ తరపున పోటీ చేసి గెలిచిన తలసాని తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని చెప్పినప్పటికీ ఇంకా మంత్రి పదవిలో కొనసాగుతున్నారని ఆరోపించారు. మ‌ళ్ళీ పోటీ చేసి ఆయ‌న గెలుపొందారా అని ప్ర‌శ్నించారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూలులోని సెక్షన్‌ ప్రకారం తలసానిఎమ్మెల్యే పదవికి అనర్హుడవుతారని తెలిపారు. అనర్హత ఎప్పటి నుంచి వర్తిస్తుందన్న విషయమై గతంలో సుప్రీం కోర్టు డివిజన్‌ బెంచీ స్పష్టత ఇచ్చిందన్నారు. ఆయన గతంలో రాజీనామా చేస్తున్నానని ప్రకటించినందున ఆయన ఆరు నెలల్లోపు మళ్లీ ఎమ్మెల్యేగానో, ఎమ్మెల్సీగానో గెలవాల్సి ఉందన్నారు. జూన్‌ 16 నుంచి తలసానికి మంత్రి పదవిలో కొనసాగే హక్కు లేదన్నారు. ఇప్పటికైనా ఎలాంటి అర్హతలేని తలసానిని మంత్రివర్గం నుంచి గవర్నర్‌ బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.
First Published:  30 Jun 2015 3:03 AM IST
Next Story